Trisha requirements for a life partner

Trisha requirements for a life partner, Trisha equation about love,Trisha love towards street dogs

Trisha requirements for a life partner, Trisha equation about love,Trisha love towards street dogs

కుక్కల్ని ప్రేమించేవాడు కావాలి

Posted: 05/29/2013 07:25 PM IST
Trisha requirements for a life partner

టాలీవుడ్  అందాల సుందరి త్రిషకు మూగ జీవాలంటే ఎనలేని ప్రేమ. అందులో కుక్కలంటే ఇంకా ఇష్టం. పెంచుకునే కుక్కలకన్నా వీధి కుక్కలంటే ఆమె ప్రాణం ఇస్తుంది. వీటి కోసం ఆమె స్వచ్చంధంగా పెటా తరుపున ప్రచారం చేసి, మూగ జీవాలను రక్షించండి తన వంతు బాధ్యతగా చెప్పింది కూడా. అలా కుక్కల పై అమితమైన ప్రేమను కురిపిస్తున్న త్రిష గత కొంత కాలంగా ఆఫర్లు లేక ఖాళీగా ఉంటుంది. ఇదే సమయంలో పెళ్లి చేసుకోవడానికి వరుణ్ని వెతుక్కుంటుంది. అయితే తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా తాను వళ్ళమాలిన ప్రేమ కురిపిస్తున్న కుక్కలతో పోల్చి చెప్పింది. ఇంకా తనకి కావాల్సిన వాడు దొరకలేదని, ఒకవేళ దొరికాడని తెలిస్తే అతను కూడా తనలా జంతువుల్ని ప్రేమించేవాడేనని ఫిక్స్‌ అయిపోవచ్చని త్రిష అంటుంది. వీధి కుక్కలను ప్రేమించే మనస్సున్న  వాడు అంటే తనను కూడా బాగా చూసుకుంటాడు. అంటే ఈమె మాటలను బట్టి చూస్తుంటే కుక్కల్ని ప్రేమించేవాడు ఈమెను బాగా చూసుకుంటాడని నమ్ముతుంది. అయితే సినీ జనాలు మాత్రం త్రిష అలాంటి లక్షణాలు ఉన్నవాడిని కోరుకుందంటే... కుక్కలాగా విశ్వాసంతో తనదగ్గరుండే వాడినే కోరుకుంటుందని, ఎవరైనా త్రిషను లైన్లో పెట్టాలంటే వీధి కుక్కలను చంకలో పెట్టుకుంటే పడిపోతుందని జోకులు వేసుకుంటున్నారు. త్రిష కు ఎలాంటి లక్షణాలు ఉన్నవాడు దొరికినా కానీ, మూగజీవాల పై ప్రేమను కూడా తనకు కాబోయేవాడితో పోల్చుకుందంటే ఈమె నిజంగా గ్రేట్ అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles