Ramcharan response on hyderabad street brawl

Actor Ramcharan response on street brawl, Union minister son Actor Ramcharan response on hyderabad street brawl, ramcharan pressmeet on street brawl, ramcharan says am not guilty, ramcharan street brawl photos morphed

Actor Ramcharan response on street brawl, Union minister son Actor Ramcharan response on hyderabad street brawl, ramcharan pressmeet on street brawl, ramcharan says am not guilty, ramcharan street brawl photos morphed

కారు దిగితే... సీన్ వేరేలా ఉండేది

Posted: 05/09/2013 09:49 PM IST
Ramcharan response on hyderabad street brawl

సినీ నటుడు రామ్ చరణ్ తేజ్ పోయిన ఆదివారం బంజారాహిల్స్ లో రోడ్డు పై ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను కొట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఇంకా సద్దుమనగక పోగా చిలికి చిలికి గాలివాన లాగా తయారవుతుంది. దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై దాడి చేసిన ఘటనపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా పోలీసులును ఆదేశించాలని కోరుతూ న్యాయవాది సలీం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన గురువారం ఫిర్యాదు దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కమిషన్.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి జూన్ 18లోగా నివేదిక సమర్పించాలని నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. పిటీషన్ ని స్వీకరించడంతో రామ్ చరణ్ ని అరెస్టు చేస్తారా అనే సందేహాలు మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉండగా  ఈరోజు రామ్ చరణ్ తేజ్ మీడియా సమావేశం పెట్టి ఆ సంఘటన పై స్పందించారు. దాడి జరిగి ఇన్నిరోజులైనా మీడియా కావాలనే రాద్దాంతం చేస్తుందని ఆ విషయంలో వారికి సెక్యూరిటీ సిబ్బంది క్షమాపణలు చెప్పిన తప్పుడు కథనాలు ప్రచురిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికలలో వచ్చిన ఫోటోల పై స్పందిస్తూ దాడి జరిగినప్పుడు తాను కారులోనే తన భార్యతో పాటే ఉన్నానని, ఆ ఫోటోలను మార్ఫింగ్ చేశారని అన్నారు. మార్పింగ్ కి సంబంధించిన ఫోటోలను ఆయన మీడియా ముందు ఉంచారు. ఆ ఫోటోలను అడ్డుపెట్టుకుని ఓ ఫోటోగ్రాఫర్ తన వద్ద నుంచి డబ్బు గుంజాలని చూసాడని కూడా చరణ్ చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో తాను హుందాగా వ్యవహరించానని, ఆ సమయంలో నేను కారు దిగి ఉండే పరిస్థితి వేరేలా ఉండేదని ఆయన అన్నారు. తన సెక్యూరిటీ సిబ్బంది వారితో తోపులాటకు దిగారే తప్ప ఎవరినీ కొట్టలేదని వెనకేసుకొచ్చారు చరణ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles