Allu arjun new movie titled boochodu png

Allu Arjun new movie titled Boochodu, Allu Arjun Boochodu Movie, Allu Arjun Boochodu with Sampath Nandi, Sampath Nandi Allu Arjun Boochodu, Allu Arjun Boochodu Movie Details

Allu Arjun next movie after Iddarammayilatho will be with Director ... the title of the movie was changed and the new title would be 'Boochodu

బూచోడు గా అల్లు వారి అబ్బాయి

Posted: 04/09/2013 12:14 PM IST
Allu arjun new movie titled boochodu png

కిక్ , ఊసరవెల్లి చిత్రాలతో కాస్తంత స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి తన తదుపరి చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయనున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే ఈ చిత్రానికి సంబంధించి ‘రేసు గుర్రం ’ అనే టైటిల్ ని ఖారారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఫిలింనగర్ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రానికి 'బూచోడు' అనే ఓ వింత టైటిల్ ని ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బన్నీ సినిమాకు ఈ టైటిల్ పెట్టడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ టైటిల్ కచ్చితంగా జనాల్లో ఆసక్తిని రేపుతుందని సినీవర్గాలు చెబుతున్నాయి. శ్రుతి హాసన్ ఈ సినిమాలో బన్నీ సరసన కథానాయికగా నటిస్తోంది. అయితే గతంలో ఎన్టీఆర్ సినిమాకు ‘ఊసరవెల్లి ’ అనే టైటిల్ పెట్టిన సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి ఇలాంటి టైటిల్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles