Puri shifting to bollywood very soon

Director Puri Jagannath, Bollywood, Puri Jagannath shifting Bollywood,

Director Puri Jagannath seems to be shifting his base to Bollywood soon after his Iddarammayi-latho shooting in Hyderabad with Allu Arjun as hero.Puri debut with the Amitabh Bachchan starrer Buddha

బాలీవుడ్ కి షిప్టు అవుతున్న పూరీ

Posted: 04/08/2013 12:19 PM IST
Puri shifting to bollywood very soon

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలుగు సినిమాలకి కి గుడ్ బై చెప్పి తన కెరియర్ ని బాలీవుడ్ లో కొనసాగించాలనుకుంటున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా వెండితెర పైకి వచ్చిన పూరి జగన్నాథ్ తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు తీశాడు. హీరోయిన్లకు పరభాష మీద మోజు పుట్టినట్లుగానే పూరికి కూడా బాలీవుడ్ పై మోజు పుట్టినట్లు ఉంది. ఆ మధ్యన అమితాబ్ బచ్చన్ తో సినిమా తీసి మంచి పేరు సంపాదించుకున్న పూరీ పర్మినెంట్ గా బాలీవుడ్ కే చెక్కేయాలని చూస్తున్నట్లు సమాచారం. 'సన్నాఫ్ సర్దార్' చిత్ర నిర్మాత పచాసియా బేనర్లో రెండు సినిమాలు చేయడానికి పూరీ ఒప్పందం చేసుకున్నాడు. ఇవి కాక బాలీవుడ్లో A గ్రేడ్ హీరో ఒకరు పూరీతో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు. ఇక అక్కడ సొంతింటిని కూడా కొనుక్కునే ప్లాన్ లో ఉన్నాడట. ఈ తతంగం అంతా చూస్తుంటే పూరీ తన గురువు రామ్ గోపాల్ వర్మ దారిలోనే పయణిస్తున్నాడని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles