Bandla ganesh offers 17 crores to ram charan

Bandla Ganesh, ram charan tej, mega power star, 17 Crores Remuneration, korata shiva, news movie

Bandla Ganesh Offers 17 Crores Remuneration to Ram Charan

చరణ్ కి 17 కోట్ల రెమ్యునరేషన్

Posted: 04/06/2013 10:32 PM IST
Bandla ganesh offers 17 crores to ram charan

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా బడ్జెట్ హాలీవుడ్ రేంజ్ లో కాకపోయినా, బాలీవుడ్ రేంజ్ కి దగ్గరగా వెళుతుంది. కారణం నిర్మాతలు అత్యుత్సాహం చూపడం, పొడ్రక్షన్ ఖర్చు పెరిగిపోవడం, అందిన కాడికి హీరోలు తీసుకోవడం. ఈ పరిస్థితి వల్ల చిన్న సినిమాలు రావడం లేదు. దాంతో వేల మంది రోడ్డున పడుతున్నారు. ఒక నిర్మాతను మించి మరో నిర్మాత ఖర్చు పెట్టి సినిమా తీసి, ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి సినిమా ఆడినన్ని రోజులు ఆడించి డబ్బులు దండుకుంటున్నారు. ఇది ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితి. అసలు విషయం ఏంటంటే.... తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న స్టార్ హీరోల పారితోషికం చుక్కల్ని అంటుతుంది. తాజాగా బడా నిర్మాతగా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ రామ్ చరణ్ తేజ్ కి భారీగా పారితోషికం ఇవ్వజూపాడట. రామ్ చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను నిర్మించే బండ్ల గణేష్ రామ్ చరణ్ పారితోషికంగా 17 కోట్ల రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడట. ఇక ఈయన నిర్మించిన బాద్ షా సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మరి ఇలా ఇచ్చుకుంటూ పోతే చిన్న హీరోల, చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles