Bhkta prahlada first telugu talkie movie

bhkta prahlada movie, bhkta prahlada first telugu talkie movie, bhkta prahlada movie release in 1932, first telugu hero krishna rao, first telugu movie director, first telugu director hm reddy

bhkta prahlada first telugu talkie movie

5.gif

Posted: 02/06/2013 06:18 PM IST
Bhkta prahlada first telugu talkie movie

      Bhakta_Prahlada మన తొలి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’  నేటితో 82 వఏట ఎంటరైంది. ఈ చిత్రం 1932 ఫిబ్రవరి 6న విడుదలైంది. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. 18 వేల రూపాయల పెట్టుబడితో 18 రోజుల్లో సినిమా నిర్మాణం పూర్తి చేశారు. 9,762 అడుగుల నిడివిగల 10 రీళ్ల ఈ చిత్రం 1932 జనవరి 22న బొంబాయిలో సెన్సారింగ్ జరుపుకుంది.
      ఈ సినిమాను మొదట బొంబాయిలోని కృష్ణా సినిమా థియేటర్‌లో ఫిబ్రవరి 6న విడుదల చేశారు. బొంబాయిలో రెండు వారాలు ఆడిన తర్వాత విజయవాడ (శ్రీ మారుతి సినిమాహాలు), రాజమండ్రి (శ్రీకృష్ణా సినిమాహాలు)ల్లో విడుదలైంది. ఈ సినిమా నిర్మాణం కోసం హెచ్.ఎం.రెడ్డి ఎంతో ప్రయాసపడ్డారు. సురభి నాటక కంపెనీవారితోనే ఇందులో ఎక్కువ వేషాలు వేయించారు. మునిపల్లె సుబ్బయ్య, సురభి కమలాభాయి, సింధూరి కృష్ణారావు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఎల్వీప్రసాద్ మొద్దబ్బాయిగా నటించారు. దీనిని బట్టి టైటిల్ రోల్ చేసిన కృష్ణారావునే మన తొలి తెలుగు హీరోగా చరిత్ర కెక్కారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kho kho moive platinum disk function
Mirchi movie director siva interview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles