Mirchi movie director siva interview

mirchi movie, prabhas, director koratala siva, director koratala shiva interview, mirchi movie wallpapers, mirchi movie teaser, anushka, richa, movie news, film news

mirchi movie director siva interview

9.gif

Posted: 02/06/2013 11:16 AM IST
Mirchi movie director siva interview

mir31

      సినీ రచయితగా 'భద్ర' చిత్రంతో వెలుగులోకి వచ్చిన కొరటాల శివ తర్వాత 'బృందావనం' చిత్రానికి పనిచేశారు. తొలిసారిగా ప్రభాస్‌ హీరోగా నటించిన 'మిర్చి' చిత్రానికి దర్శకునిగా మారారు. యు.వి. క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ సంయుక్తంగా నిర్మించగా, దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఈనెల 8న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మీడియాతో ముచ్చటించారు.
          'చిన్నతనం నుంచి పుస్తకపఠనం, రచనలు చేయడంపై ఆసక్తి ఉండేది. రచయితగా పోసాని కృష్ణమురళి దగ్గర పనిచేశాను. శ్రీశ్రీ 'మహాప్రస్తానం' చదివాక, ఎమోషన్స్‌ ను ఇలాక్కూడా రాయవచ్చా. పదాలతో పౌరుషాన్ని రగిలించవచ్చానని నాకనిపించింది. అదే రచయితగా మరింత ప్రోత్సాహాన్నిచ్చింది' అన్నారు రచయిత కొరటాల శివ తన ప్రసంగాన్ని స్టార్ట్ చేస్తూ..

16      

         ఇక ప్రభాస్ మిర్చి ఘాటును వివరిస్తూ.. ఘాటు తోపాటు రుచి ఉంటేనే మిర్చి. స్సైసీ ఉంటుందనే ఈ పేరు ఎంపిక చేశాం. ప్రభాస్‌ పాత్రకి, శరీరభాషకి సరిపడే టైటిల్‌ ఇది.. అని అన్నారు. ప్రభాస్‌ కొత్త లుక్‌లో వైవిధ్యమైన పాత్రలో కన్పించే చిత్రమిది. కథానాయిక లిద్దరూ కేవలం గ్లామర్‌కే పరిమితం కాదు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటించారు. దేవీ రీరికార్డింగ్‌ తన కెరీర్‌లోనే బెస్ట్‌. ఆడియో ఘనవిజయం సాధించింది. 'వీలైతే ప్రేమిద్దాం.. పోయేదేముంది? అన్న ప్రభాస్‌ డైలాగ్‌లోనే కథంతా ఇమిడి ఉంది. ఎలాంటి సందర్భంలోనైనా హీరో చెప్పే డైలాగ్‌ ఇది. కుటుంబసమేంతంగా చూడదగ్గ చిత్రమిది. ఊళ్లలో మాస్‌ అనుకుంటారు. అమ్మాయిలు రొమాంటిక్‌ బారుగా చూస్తారు. యువత ఐకాన్‌గా భావిస్తారు. ఈ కథ అనుకున్నప్పుడే ప్రభాస్‌ హీరో అని భావించాం. కథ చెప్పేందుకు వెళితే తాను రాజమౌళి సినిమా చేస్తున్నానని, కథ విననంటే విననని మొదట ప్రభాస్ మొండికేశారు. ఎలాగైనా ఒప్పించి కథ చెప్పాక, రాజమౌళిని ఒప్పించి మరీ ఈ సినిమా చేస్తానని చెప్పటమే కాదు.. తననే డైరెక్ట్‌ చేయమని ప్రభాస్ కోరారని శివ వివరించారు.
         ఇంకా ఆయన మాట్లాడుతూ..'మణిరత్నం సినిమాలో గొప్ప కథ చెబుతారు. రాజ్‌కుమార్‌ సంతోషి సినిమాలంటే ఇష్టం. విశ్వనాథ్‌ టేకింగ్‌ అంటే ప్రియం. వీరి ప్రేరణ ఉంది' అని అన్నారు. మాటల గురించి చెబుతూ.. 'కథే సినిమాను నడిపిస్తుంది. మాటల్ని పుట్టిస్తుంది. స్క్రిప్ట్‌ రాసుకోవడం తెలిస్తే దర్శకత్వం వహించడం కష్టమేమీకాదంటున్నారు శివ. ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ‘మిర్చి’ మాంచి స్పైసీగా ఉంటుందని అందరూ రుచి చూడాలని కోరారు.

...avnk

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhkta prahlada first telugu talkie movie
Hero siddarth in ntr baadsha movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles