Telugu movie updates

telugu-movie-updates, shankar, vikram manoharudu, nitin nitya menon movie tamil remake, anushka about bollywood

telugu-movie-updates

19.gif

Posted: 09/17/2012 07:34 PM IST
Telugu movie updates

       యోగా బ్యూటీ అనుష్క కొత్త పల్లవి అందుకుంది. ‘చాలా మంది హీరోయిన్స్ సౌత్ ఇండియాలో కొన్ని హిట్ సినిమాల్లో నటించి తర్వాత anushka_inerతమ సత్తా చాటుకోవడానికి బాలీవుడ్ కి వెళ్తున్నారు. అందులో తప్పేమీ లేదు కానీ బాలీవుడ్లో నటించడమే తమ లక్ష్యంగా పెట్టుకోవడం తప్పని ‘ అనుష్క అంటోంది. ‘ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏమి తక్కువ కాదు, ఇక్కడ కూడా మంచి సినిమాలు చాలానే వస్తున్నాయి. ప్రస్తుతం మన సౌత్ ఇండియన్ సినిమాలు బాలీవుడ్ కి వెళ్తున్నాయి. అలాగే తెలుగు, తమిళంలో కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ వస్తున్నాయి. ‘అరుంధతి’ సినిమా బాలీవుడ్ కి విపరీతంగా నచ్చేసింది మన డైరెక్టర్స్ తీర్చిదిద్దే హీరోయిన్ పాత్రలు బాలీవుడ్ తో పోల్చుకుంటే ఏ మాత్రం తక్కువ కాదు.అంటోంది ఈ అమ్మడు. ప్రస్తుతం అనుష్క నాగార్జున సరసన నటించిన ‘డమరుకం’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా ప్రభాస్ సరసన ‘వారధి’ సినిమాలో నటిస్తోంది.
       సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ vikram_shankarశంకర్ -స్టార్ హీరో విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మరో భారీ ప్రాజెక్టు 'మనోహరుడు'. తమిళంలో 'ఐ' పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఇప్పటి వరకూ 41 రోజులు చిత్రీకరణ జరుపుకుంది. ఈ 41 రోజుల చిత్రీకరణలో ఒక యాక్షన్ సీక్వెన్స్, ఒక పాట, కొన్ని సన్నివేశాలను మాత్రమే షూట్ చేసారని సమాచారం. ఇప్పటికే శంకర్-విక్రమ్ కాంబినేషన్ లో 'అపరిచితుడు' సినిమా వచ్చి సంచలన విజయం సాధించింది. ‘అపరిచితుడు’ కంటే ఈ సినిమా 100 రెట్లు బాగుంటుందని, చాలా కేర్ తీసుకుని సినిమా నిర్మిస్తున్నామని విక్రమ్ అంటున్నాడు.
       నితిన్ - నిత్యా మీనన్ జంటగా విక్రమ్ కుమార్ తెరకెక్కించిన 'ఇష్క్' చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ishque_innఇప్పుడీ సినిమాను తమిళంలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హన్సిక కథానాయికగా ... జయప్రద కజిన్ 'సిద్ధార్థ్' హీరోగా ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్టోబరులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kerala kutties attaction
Brahmanandam jaffa movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles