Nagarjuna damarukam audio function

nagarjuna damarukam audio function, raghavendra rao, devisriprasad

nagarjuna damarukam audio function

1.gif

Posted: 09/11/2012 12:39 PM IST
Nagarjuna damarukam audio function

      damarukam_in సాధారణంగా పర్సనల్ ఇంటర్వూల్లో కానీ, పబ్లిక్ ఫంక్షన్స్ లో స్పీచ్ ఇచ్చేటప్పుడు కింగ్ అక్కినేని నాగార్జున చాలా కాజువల్ గా మాట్లాడేస్తుంటారు. ఆయన మాటలు ఎక్కడా తొణకవు బెణకవు. అయితే అందుకు పూర్తి విరుద్దంగా సాగింది ఆయన మాటల ప్రవాహం. దీనికి వేదిక ఆయన నటించిన ‘డమరుకం’ ఆడియో విడుదల కార్యక్రమం. ఈ వేడుక లో కింగ్ భావోద్వేగానికి లోనయ్యారు. "నా కెరీర్లో నేను మూడుసార్లు పడి లేచాను. గెలుపు, ఓటములనేవి ఎవరికైనా వుంటాయి. అయితే, నా అభిమానులు మాత్రం ఎప్పుడూ నన్ను వెన్నంటి ఉంటూ, ప్రోత్సహిస్తూ వచ్చారు. నేను ఎటువంటి ప్రయోగం చేసినా నన్ను ఆదరించారు. గత పాతికేళ్ల నుంచీ అభిమానులు అలా తమ అభిమానాన్ని నా మీద కురిపిస్తూనే వున్నారు. అందుకే నా అభిమానుల్ని చూసి ఎప్పుడూ గర్వపడుతుంటాను" అని కన్నీరు పెట్టారు నాగార్జున.
        damarukam_in_2.1అంతేకాదు తన దృష్టిలో చిన్న దర్శకులు, పెద్ద దర్శకులు అనే తేడా ఉండదని అక్కినేని నాగార్జున చెప్పారు. ప్రతిభ వుంటే చాలనుకుంటానని ఆయన అన్నారు. ఎన్నో అద్భుతాలు సృష్టించిన వారిలో చిన్న దర్శకులు చాలామంది వున్నారని నాగార్జున అభిప్రాయపడ్డారు. అందుకే, తాను మొదటి నుంచీ ప్రతిభ వున్న వారందరికీ అవకాశాలు ఇచ్చానని ఆయన అన్నారు.
        నిన్న రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో వేడుకగా జరిగిన 'డమరుకం' చిత్రం ఆడియో వేడుకలో ఆయన ఆ విధంగా స్పందించారు.  పాటల సీడీలను ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఇది సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన 50 వ చిత్రం కావడంతో, ఆయన చేత ప్రత్యేకమైన కేక్ ను కట్ చేయించారు. ప్రతిగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూdevi "నేను చేసిన తొలి చిత్రం 'దేవి' భక్తిరస చిత్రం కావడం, మళ్లీ 50 వ సినిమా 'డమరుకం' కూడా అలాంటిదే కావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇళయరాజా చేసే లాలిపాటలంటే ఎంతో ఇష్టం. అలాంటి పాట ఒకటి చేయాలని వుండేది. ఇందులో అలాంటి పాట చేసే అవకాశం వచ్చింది" అన్నారు.
      ఇంకా రాజమౌళి, వీవీ వినాయక్, యస్వీ కృష్ణారెడ్డి, చిత్ర దర్శకుడు శ్రీనివాసరెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ చిత్రంలోని 'సక్కూభాయ్ గరం చాయ్...' పాటను ఈ వేదికపై గాయని మమతా శర్మ పాడగా, కథానాయిక చార్మీ డ్యాన్స్ చేసి, అందర్నీ ఆకట్టుకుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli prabhas hi quality movie
Chiranjeevi compliment to nagarjuna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles