Chiranjeevi cheif guest for camera men gangato rambabu audio

chiranjeevi cheif guest for camera men gangato rambabu audio,

chiranjeevi cheif guest for camera men gangato rambabu audio

3.gif

Posted: 09/10/2012 12:46 PM IST
Chiranjeevi cheif guest for camera men gangato rambabu audio

         గబ్బర్ సింగ్ లో కనిపించిన సందడి మెగా ఫ్యాన్స్ అభిమానులకు మరో మారు కలుగబోతోంది.  మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కలిసి మళ్లీ ఒకే వేదికపైకి వచ్చి, అభిమానులకు కనువిందు చేయనున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో chiru_eeeరూపొందుతున్న 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రం ఆడియో వేడుకకు చిరంజీవి చీఫ్ గెస్ట్ గా విచ్చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 21 న హైదరాబాదులో ఘనంగా జరుగనున్న ఈ సినిమా ఆడియో వేడుకలో పాటలను చిరంజీవి విడుదల చేస్తారు. పవన్ కల్యాణ్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 11 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.‘ ..రాంబాబు’ ఫస్ట్ లుక్ విడుదలైన కొద్దిసేపటికే అత్యధిక మంది వీక్షించి కొత్త రికార్డు నెలకొల్పితే, ఇక పాటలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి రేగుతోంది. దీనికి తోడు పాటల రిలీజ్ కు మెగాస్టార్ చీఫ్ గెస్ట్ ఆయే..
      ఇదిలా ఉండగా,  ప్రస్తుతం దక్షిణాదిలో విజయవంతమైన చిత్రాలని హిందీలోకి రీమేక్‌ చేయడం ట్రెండ్‌గా మారడంతో రాబోయే తెలుగు చిత్రాల్లో కొన్నింటిపై బాలీవుడ్‌ హీరోలు నిఘా పెట్టారు. వాటిలో పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న కెమెరామెన్‌ గంగతో రాంబాబు చిత్రం ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. రీమేక్‌ కింగ్‌ సల్మాన్‌ఖాన్‌కి 'గబ్బర్‌సింగ్‌' కారణంగా పవన్‌ cmgtచిత్రాలపై ఆసక్తి పెరిగింది. టాలీవుడ్‌లో తనలాంటి ఇమేజ్‌ ఉన్న హీరో పవన్‌కళ్యాణ్‌ అని, అతని సినిమా రీమేక్‌ చేస్తే తనకి సరిపోతుందని సల్మాన్‌ భావిస్తున్నాడట. అంతేకాదు.. 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' కథ కూడా యూనిర్సల్‌గా సెట్‌ అయ్యే మీడియా నేపథ్యంలో ఉండటం సల్మాన్‌ని మరింతగా ఆకర్షిస్తోందట. మరోవైపు అజయ్ దేవ్‌గణ్‌, అక్షయ్ కుమార్‌ కూడా 'రాంబాబు' మీదే కన్నేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాంబాబుపై హిందీ హీరోలేగాక తమిళ, కన్నడ హీరోలు కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఫస్ట్‌ షో టాక్‌ తెలియగానే రీమేక్‌ రైట్స్‌ పట్టేయడానికి వలలు కూడా సిద్ధం చేసుకున్నారు. అదీ సంగతీ..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjuna as ramakrishna parama hamsa
Director ravibabu movie avunu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles