Sridevi advises

sridevi advises, beauty, english vinglish, jim, yoga ,

sridevi advises

9.gif

Posted: 09/01/2012 01:28 PM IST
Sridevi advises

sri_5.11        పూల రెక్కలు.. కొన్ని తెనె చుక్కలు.. వాటిని రంగ రించి బ్రహ్మ చేసిన బొమ్మే శ్రీదేవి. వయస్సు 49సంవత్సరాలు. కానీ నేటికీ అదే అందం. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఆమె బ్యూటీ తగ్గలేదు. ఇదెలా సాధ్యం. వయెసు పెరుగుతున్నా రోజు రోజుకూ కొత్త మెరుపులతో మెరిపోవటం ఎలా సాధ్యం. అసలు శ్రీదేవి బ్యూటీ సీక్రెట్ ఏంటీ..? అంటారా.. ఇదిగో సమాధానం.. ‘ శ్రీదేవి’... ఈ పేరు తెలియని వారు ఉండరు. ఆమెను చూసి మురిసి పోని వారు అసలు ఉండరు. 1963 ఆగస్టు 13వ తేదీన పుట్టిన శ్రీదేవి పదేళ్ల వయసులో తెరంగ్రేటం sri_4.111చేసింది. బాల భారతం, బడి పంతులు సినిమాల్లో ముద్దులొలికే మాటలతో అందరినీ అలరించింది. ఇక 16ఏళ్ల వయసులో లేలేత అందాలతో తెలుగు తెరకు కొత్త అందాలు పంచింది. ఇక బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవిని బుర్ర ముక్కు భామంటూ అందరూ వెటకారం చేశారట. దీంతో నొచ్చుకున్న శ్రీదేవి ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. తన 25ఏళ్ల వయసులో శ్రీదేవి నటించిన ఆఖరి పోరాటం టాలీవుడ్ కి కొత్త లుక్ ఇచ్చింది. అబ్బ దీని సోకు అంటూ జనం మురిసి పోయేలా చేసింది.

అదే టైంలో బాలీవుడ్ లో మరో సంచలనం చాందినీ. రుషి కపూర్ తో నటించిన శ్రీదేవి నేటికీ చాందినీయే. ఇక 30ఏళ్ల వయస్సులో శ్రీదేవి సినిమా గోవిందా గోవిందాలో ఆమె అందంపై పాట రాశారు. పాల సంద్రంతో శ్రీదేవి అందాన్ని పోల్చారు. అందమంటే శ్రేదేవిదే అంటూ టాలీవుడ్ కవులు ముచ్చట తీర్చుకున్నారు. ఇక 35ఏళ్ల వయసులో హిందీ మూవీ జుదాయ్ తో సినిమాలకు గుడ్ బై కొట్టిన శ్రీదేవి బోనీ కపూర్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. మళ్లీ ఇప్పుడు ఇంగ్లీస్ వింగ్లీష్ తో తెర మీదకు వస్తోంది. అంటే దాదాపు 15సంవత్సరాల తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలు పెడుతోంది. మధ్య మధ్యలో కొన్ని సినీ ఆఫర్లు వచ్చినా పిల్లల కోసం వదులు కున్న శ్రీదేవి యాడ్ లకూ దూరం అయింది.
        ఇంతకీ శ్రీదేవి స్పెషల్ ఏంటీ..? దాని దగ్గరకే వద్దాం.. 25ఏళ్ల వయసులో ఎంత అందంగా ఉందో ఇప్పుడు కూడా అదే అందంతో మెరిసి పోవడం కేవలం శ్రీదేవికే చెల్లింది. ఇదెలా సాధ్యం. శ్రీదేవి అందం ఎందుకు తగ్గలేదు. ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటీ..? అదీ తెలుసుకుందాం...

        sri_devi_1149ఏళ్ల వయసులో ఉన్న శ్రీదేవికి మళ్లీ ఇప్పుడు సినిమాల్లో మళ్లీ నటించాలన్న కోరిక పుట్టింది. అందుకేనేమో గత కొంత కాలంగా యోగా చేస్తోంది. బాడీ కొలతల్లో తేడా లేకుండా చూసుకుంది. యోగాతోనే ఇంత అందం సాధ్యమా అంటే అదీ కాదు. అందం కోసం శ్రీదేవి చాలా జాగ్రత్తలు తీసుకుంది. యోగా, జిమ్ లకు వెళ్లిన కొత్తల్లో బుగ్గలు తగ్గటంతో ఇంకా జాగ్రత్త పడింది. ఫ్రయిడ్ రైస్ లు తినడం మానేసింది. జంక్ ఫుడ్ లు ముట్టడం లేదు. పొద్దున్నే డ్రై ఫ్రూట్ జ్యూస్.. మధ్యాహ్నం సాఫ్ట్ ఫుడ్.. పుల్కా.. గ్రేప్ జ్యూస్. ఇక సాయంత్రం పుల్కా.. పాలు. ఆయిల్ ఫుడ్స్ కు చాలా దూరం. ఇక రోజూ ఉదయం సాయంత్రం యోగా తన పిల్లలతో టెన్నిస్ ఆడటం. ఇదీ ఆమె దిన చర్య. అంతేకాదు అనవసరపు ఆలోచనలు చేసే అలవాటే లేదని చెబుతోంది శ్రీదేవి. వేస్ట్ ఆలోచనలతో మైండ్ పాడు చేసుకోవడం ఇష్టం లేదనీ దాని వల్ల టెన్షన్ పెరిగి మొహం పీక్కు పోతుందనేది శ్రీదేవి స్ట్రాటజీ. అందుకే ఏదైనా టేకిటీజ్ పాలసీ అని ఫేస్ బుక్ లో రాసుకుంది. అందుకే తాను యాభైలో పడ్డా వంటి మెరుపులు తగ్గడం లేదంటోంది. తనకే కాదు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటే అందం అందరి సొంతం అని ఉచిత సలహా ఇచ్చేస్తోంది మన పూల రెక్కలు.. తేనె చుక్కలు రంగరించి బ్రహ్మ చేసిన మన భామ.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amir khan greatness
Jeeva mask movie review  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles