Jeeva mask movie review

jeeva mask movie review,

jeeva mask movie review

16.gif

Posted: 08/31/2012 08:13 PM IST
Jeeva mask movie review

mask_innereeee
సినిమా పేరు   : మాస్క్

విడుదల తేదీ  : 31 ఆగష్టు 2012

దర్శకుడు      : మిస్కిన్
నిర్మాత        : ఎన్.వి ప్రసాద్, పరాస్ జైన్
సంగీతం       : కె
నటీనటులు   : జీవా, పూజ హెగ్డే

ఆంధ్రవిశేష్.కాం రేటింగ్ : 2.5

      విడుదలకు ముందే హాలీవుడ్ స్థాయిలో ఉండబోతుందంటూ హోరెత్తించిన చిత్రం ‘మాస్క్’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి చౌదరి తనయుడిగా తమిళ్ లో అరంగేట్రం చేసిన జీవా ‘రంగం’ చిత్రంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ యంగ్ హీరో ఈ సారి సూపర్ హీరో అవతారమెత్తి ‘మాస్క్’ చిత్రంతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా హొయలొలికించింది. ఇక ఈ చిత్రం ఎలా ఉందో ఓ మారు పరికిద్దాం..

స్టోరీ :
       విశాఖపట్నంలో పేరు మోసిన ఒక గ్యాంగ్ ముసుగులు ధరించి భారీగా దొంగతనాలకు పాల్పడుతుంది. వీరి గుట్టు రట్టు చేయటం పోలీసులకు తలకు మించిన భారంగా మారుతుంది. ఈ దోపిడీ ముఠాను అరికట్టడం కోసం స్పెషల్ ఆఫీసర్ (నాజర్) ని రంగంలోకి దింపుతారు. ఇలా ఉండగా,  బి.ఎస్.సి డిగ్రీ పూర్తి చేసుకుని నిరుద్యోగి అయిన  మన హీరో ఆనంద్ బ్రూస్ లీ (జీవా) కుంగ్ ఫూ లో ఆరితేరతాడు. ఒక చూపులో నాజర్ కూతురైన పూజ హెగ్డే ని చూసి బ్రూస్ లీ ప్రేమలో పడతాడు. ఆమెని ప్రేమలో పడెయ్యాలని రోజూ రాత్రి ముఖానికి మాస్క్ వేసుకుని పలు విన్యాసాలు చేస్తుంటాడు.  ప్రేమించమని వెంతపడుతుంటాడు. అలా ఒకరోజు రాత్రి పూట అనుకోకుండా తారసపడిన దొంగతనం చేసే గ్యాంగ్ లో ఒకరిని పోలీసులకు పట్టిస్తాడు. అది చూసి పూజ బ్రూస్ లీ ని ఇష్టపడుతుంది. కథ సాఫీ గా జరుగుతుంది అనుకున్న సమయంలో హీరో ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. శాస్త్రవేత్త అయిన బ్రూస్ లీ తాత(గిరీష్ కర్నాద్) సాయంతో ఎలా గట్టెక్కుతాడనేదే చిత్ర కథ.

సమీక్ష :
       సహజంగానే కుంగ్ ఫూ తెలిసిన జీవా కి ఈ మూవీలోని ఆ విభాగంలో రక్తికట్టించటం తలకు మించిన భారం కాలేదు. యాక్షన్ సన్నివేశాలలో అతని ఎనర్జీ లెవెల్స్ బావున్నాయి. హీరోయిన్ పాత్ర చాలా పరిమితంగా ఉండటంతో ఆమేరకు పూజ హెగ్డే బాగానే నటించింది. విలన్ పాత్రలో నరైన్ ఓకే. ఇక సీనియర్ నటులైన గిరీష్ కర్నాడ్, నాజర్ వారి వారి పరిది మేరకు మెప్పించారు. జీవా, గిరీష్ కర్నాద్ మధ్య వచ్చే సన్నివేశాలు.. వి.ఎఫ్ ఎక్స్ సీన్స్ బాగున్నాయి. ఇక కథనం నడిచిన తీరు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా ఉంది. సీన్స్ లో లాజిక్ కోసం వెతకితే అలసిపోవటమే. హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ రక్తి కట్టించలేదు. డైరెక్టర్ మిస్కిన్  పనితనం అంతంతమాత్రమే. చివర్లో వచ్చిన సస్పెన్స్ ఎలిమెంట్ కూడా డొల్లే... ‘స్పైడర్ మాన్’ రేంజ్ లో చిత్రాన్ని ఊహించుకు వెళితే.. తుస్సే.. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనిపించింది. ఎడిటింగ్ బుస్సు.... స్ర్కీన్ ప్లే మిస్సు..

ఉపసంహారం :     ముసుగులో గుద్దులాటే....

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sridevi advises
Nayana tara and tabu updates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles