‘బెట్టింగ్ బంగార్రాజు’ తర్వాత అల్లరి నరేష్-సత్తిబాబుల కాంబినేషన్లో వస్తున్న సోషియో ఫాంటసీ చిత్రానికి ‘యముడికి మొగుడు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. 20 ఏళ్ల క్రితం చిరంజీవి ఇదే టైటిల్ తో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. నిర్మాత చంటి అడ్డాల చిరంజీవి మీద ఉన్న అభిమానంతో ఆయన పుట్టిన రోజునాడే (ఆగస్టు 22) ఈ టైటిల్ ను ప్రకటించారు. ఇందులో యముడిగా షాయాజి షిండే నటిస్తున్నాడు. ఈ సినిమాను దసరాకు విడుదల చేయనున్నారు.
అల్లరి నరేష్, రిచాపనరు నాయకానాయికలుగా ఇ. సత్తిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్ర లోగో కార్యక్రమం తూర్పుగోదావరి అంతర్వేది దేవాలయంలో జరిగింది. లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో చిరు బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. నరేష్ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. అనంతరం నరేష్ మాట్లాడుతూ, గతంలో చిరంజీవి గారి చిత్రం టైటిల్‌తో తాను చిత్రం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆయన నటించిన మరో చిత్రం 'అల్లుడా మజాకా'లోని 'అత్తో అత్తమ్మ కూతురో' పాపులర్ సాంగ్‌ను ఈ చిత్రంలో రీమిక్స్ చేశానని తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ, ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ను గత పదిరోజులుగా పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో జరుపుతున్నామన్నారు. ఇందులో భాగంగా గోదావరి గట్టుపై ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో గత మూడురోజులుగా హీరోహీరోయిన్లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నామని చెప్పారు. ఈనెల 28వరకు పాలకొల్లు పరిసరాల్లోనే షూటింగ్ జరుపుతామని, హీరోకి సంబంధించిన గ్రామీణ నేపథ్య సన్నివేశాలను, ఇంకా ప్రతినాయకుడు భరణి సన్నివేశాలను అక్కడ తీయనున్నామని చెప్పారు. ఈ షెడ్యూల్‌తో రెండు పాటల చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఓ పాటను, విదేశాల్లో మరో పాటను చిత్రీకరించడంతో షూటింగ్ ముగుస్తుందని వివరించారు. సెప్టెంబర్‌లో ఆడియోను, దసరాకు సినిమాను విడుదల చేస్తామని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, కథకు అన్నివిధాలా సరిపోయే టైటిల్ ఇది. ఇంతవరకు ఏ చిత్రంలో చూపించని విధంగా యువడితోపాటు యముడి భార్య, కొడుకు వంటి పాత్రలను ఇందులో చూపించబోతున్నామని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రవీంద్రబాబు, సంగీతం: కోటి.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more