Naga chitanya in veeru potla direction

naga chitanya in veeru potla direction

naga chitanya in veeru potla direction

21.gif

Posted: 08/23/2012 06:07 PM IST
Naga chitanya in veeru potla direction

       అక్కినేని ఫ్యామిలీ అభిమానులకు శుభవార్త. చాలా కాలంగా తమ అభిమాన హీరో నాగార్జున తనయుడు నాగచైతన్య నుంచి బ్లాక్ nag_eeబస్టర్ కోసం ఎదురు చూస్తోన్న ఫ్యాన్స్ కోరిక ఇంతవరకూ తీరలేదు. అంతేకాదు. కొంతకాలంనుంచీ నాగ చైతన్య హీరోగా వచ్చిన మూవీస్ కూడా బహు అరుదు. ఈ తరుణంలో యంగ్ హీరో చైతు నుంచి మరో మూవీ రూపుదిద్దుకోబోతోంది.  వీరు పొట్ల దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందించడానికి కామాక్షీ మూవీస్ వారు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో నాగార్జున హీరోగా ఈ బ్యానర్ కొన్ని సూపర్ హిట్లను అందించింది. అదే ఊపుని నాగ చైతన్య విషయంలోనూ చూపించాలని ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఈ బ్యానర్ పై వచ్చిన 'దడ' చిత్రం ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేక పోయింది. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో తిరిగి నాగ చైతన్య తో మరో సినిమా చేయడానికి రంగాన్ని సిద్ధం చేసింది. గతంలో నాగార్జున తో 'రగడ' చిత్రాన్ని తెర కెక్కించిన వీరు పొట్ల ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఇక 'గబ్బర్ సింగ్' సినిమా సక్సెస్ తరువాత కూడా ఆచి తూచి అడుగేస్తోన్న శృతి హాసన్ ఈ సినిమాలో కథానాయికగా అలరించనుంది. భారీ బడ్జెట్ తో డి. శివ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తోన్నఈ సినిమా అక్టోబర్లో సెట్స్ పై కి వెళ్ల నున్నట్టు తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Eto velli poyindi manasu audio release date
Allari naresh yamudiki mogudu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles