క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘జులాయి’. ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చింది. అల్లు అర్జున్ కెరీర్లో ఏ చిత్రాన్ని విడుదలచేయనంత భారీగా ఈ చిత్రాన్ని విడుదలచేశారు. ఇలియానా కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ హారికా, హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా తీరుతెన్నులెలా ఉన్నాయో చూద్దాం..
స్టోరీ :
రవి (అల్లు అర్జున్) తొందరగా డబ్బు సంపాదించాలనుకునే ఓ తెలివైన జులాయి. తండ్రి నారాయణ మూర్తి(తనికెళ్ళ భరణి) కష్టాన్నినమ్ముకునే వ్యక్తి. రవీంద్ర భావాలకు పూర్తి విరోధి. పదివేలతో రెండు లక్షలు సంపాదించాలని పబ్ కు పయనమైన రవీంద్ర అనుకోకుండా బిట్టూ (సోనూ సూద్) ని లిప్ట్ అడిగిన క్రమంలో బిట్టూకి పరిచయమవుతాడు. లోకల్ ఎమ్మెల్యే (కోట) ప్రోద్భలంతో 1500 కోట్లు కాజేయాలని ఒక బ్యాంకు రోబరీకి ప్లాన్ చేస్తారు బిట్టు గ్యాంగ్. వీరికి అడ్డుపడ్డ సిటీ పోలీసు కమీషనర్ రాజ మాణిక్యం (రావు రమేష్) ని బిట్టూ గ్యాంగ్ చంపే తరుణంలో రవి బిట్టు తమ్మున్ని హతమార్చి రాజ మాణిక్యంని రక్షిస్తాడు. దీంతో బిట్టు టార్గెట్ రవి అవుతాడు. కమీషనర్ రాజ మాణిక్యం అప్రూవల్ గా మారిన రవిని సురక్షితంగా ఉంచడం కోసం హైదరాబాద్ కి పంపుతాడు. రాజ మాణిక్యం తన స్నేహితుడైన ఎ.సి.పి సీతారామ్ ఇంట్లో రవిని ఉంచుతాడు. హైదరాబాద్లో రవి మధు (ఇలియానా) ని చూసి ప్రేమలో పడతాడు. ఇదిలా జరుగుతుండగా బిట్టూ రవి మీద ఎలా అయినా పగ తీర్చుకోవాలని ప్లాన్స్ వేస్తుంటాడు. బిట్టూ తనకి తెలిసిన ఎం.ఎల్ ఎ వరదరాజు (కోట శ్రీనివాస రావు), ట్రావెల్స్ మూర్తి (బ్రహ్మాజీ) తో కలిసి పన్నాగం పన్నుతుంటాడు ఈ నేపథ్యంలో కథ ఎలాముగుస్తుందనేదే ఆసక్తిదాయకం.
అనుకూలాంశాలు :
అల్లు అర్జున్ డ్యాన్సింగ్ ఎనర్జీ, న్యూలుక్ హైలైట్. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ బన్నీ బాడీ లాంగ్వేజ్ కి చక్కగా సూటయ్యాయి. ఇలియానా ఈ చిత్రంలో చాలా డిఫెరెంట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో బన్నీ ఇలి రొమాంటిక్ ట్రాక్ నైస్ గా ఉంది. రాజేంద్ర ప్రసాద్ నటన బావుంది. కోట శ్రీనివాస రావు ఓకే. ఎం.ఎస్ నారాయణ బ్రహ్మానందం నవ్విస్తారు. బ్రహ్మీ హేమ పెళ్లి చూపుల సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. సోనూ సూద్ విలన్ గా నటించిన సన్నివేశాలే కాదు.. క్లైమాక్స్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు చాలా బాగా చేశారు. బ్రహ్మాజీ తనికెళ్ళ భరణి కూడా వారి పరిధి మేర నటించారు. త్రివిక్రమ్ డైలాగ్స్ సూపర్. సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, కొరియోగ్రఫీ, పాటలు ఫస్ట్ హాఫ్ కి చాలా ప్లస్ అయ్యాయి. అలీ మరియు పోసాని కృష్ణ మురళి చేసిన అతిధి పాత్రలు కొద్దిసేపే అయినా రక్తికట్టించాయి.
ప్రతికూలం :
సెంకండ్ హాఫ్ కొంత తగ్గినట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్ చాలా వేగంగా ముందుకు సాగుతుంది సెకండాఫ్ కథ సాగతీత మాదిరి సాగుతుంది. ఫైట్స్ ఇంకొంచెం బాగుంటే బాగుండేదనిపిస్తుంది. కార్లు ధ్వంసం స్కార్పియోలను గాల్లోకి లేపడం వాస్తవానికి బాగా దూరమైపోయాయి.
ఇలియానా అల్లు అర్జున్ రొమాంటిక్ ట్రాక్ అసంపూర్ణం. ధర్మవరపు కామెడీ రొటీన్.
సెకండ్ హాఫ్ లోని కామెడీ బి మరియు సి సెంటర్స్ వారికి అంత తొందరగా అర్థం కాదు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు అడ్డు అదుపు లేకుండా పోతుంది. పట్టపగలే పోలీసులతో కలిసి రోడ్డు మీదే నేరస్తులను కాల్చి చంపేస్తుంటాడు. క్లైమాక్స్ సన్నివేశాలు రొటీన్ అనిపిస్తుంది.
టెక్నికల్ టీం :
సినిమాటోగ్రఫీ సూపర్. సెకండాఫ్ లో ఎడిటింగ్ ఇంకా మెరుగ్గా ఉంటే బావుండేది. కోరియోగ్రఫీ కేక. డైలాగ్స్ విషయంలో త్రివిక్రమ్ నూటికి నూరు శాతం న్యాయం చేశారు కానీ సెకండాఫ్ అంతగా రక్తి కట్టించలేకపోయారనిపిస్తుంది. పదునైన సంభాషణలు హైలెట్. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, నేపధ్య సంగీతం మెప్పిస్తుంది.
చివరి మాట :
బి మరియు సి సెంటర్స్ ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే దానిమీదే బాక్సాఫీస్ వద్ద చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది. మొత్తంగా ఇది బోర్ కొట్టని స్టైలిష్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.
....avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more