Happy birthday to prince mahesh babu

happy birthday to prince mahesh babu

happy birthday to prince mahesh babu

1.gif

Posted: 08/09/2012 12:21 PM IST
Happy birthday to prince mahesh babu

       ప్రిన్స్ మహేష్ బాబు... టాలీవుడ్ కలెక్షన్ల స్టామినాకి ఈ పేరు కొంతకాలంగా బ్రాండ్ నేమ్ అయిపోయింది. ప్రేక్షకుడు కోరుకునే అసలు సిసలు హీరోయిజం ప్రదర్శించడంలో ప్రిన్స్ కి సాటి ఆయనకాయనే అనాలి. ఆ కేర్ లెస్ బాడీ లాంగ్వేజీ.. ఆ పవర్ పుల్ లుక్స్.. ఆ దూకుడు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో ప్రిన్స్ చేసిన దూకుడు టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసింది. అంతేకాదు princeeeమన   ప్రిన్స్.. అమ్మాయిల కలల రాకుమారుడు. ఆయనలోని ఆ ఛార్మింగ్.. ఆయనలోని ఆ హీరోయిజం..అమ్మాయిలను ప్లాట్ అయ్యేలా చేస్తుంది. ఒక్కసారి మహేష్ సినిమా చూస్తే ఎవరైనా సరే మహేష్ ఫ్యాన్ గా మారిపోవాల్సిందే. డైరెక్టర్ పూరీ ప్రిన్స్ ని `పోకిరి`గా ప్రెజెంట్ చేశారు. పూరీ మార్క్ టేకింగ్ లో ప్రిన్స్ `పోకిరి`గా రెచ్చిపోయారు. ఇంకేముంది 75ఏళ్ల టాలీవుడ్ రికార్టులన్నీ చెల్లాచెదురైపోయాయి. ప్రిన్స్ పుట్టిన రోజు సందర్భంలో మా విజిటర్స్ కి మహేష్ కి సంబంధించిన ఒక విషయాం చెబుతున్నాం.. ఇంతకు ముందు తరం హీరోల్లో చిన్న విషయానికి కూడా అసహనాన్ని ప్రదర్శించేవారని ఓ నానుడి ఉంది. అయితే, మహేష్ బాబు వీళ్లందరికీ భిన్నం. అతని నోటి నుంచి ఎప్పుడూ, ఎట్టి పరిస్థితులలోనూ కూడా పరుషపదజాలం రాదు. అతనికి బాగా కోపం వస్తే కనుక, 'చూసుకోండయ్యా ...' అంటాడట. అలా అన్నాడంటే కనుక, ఇక ఆయన స్టాఫ్ దానినే పెద్ద తిట్టుగా భావించి అలెర్ట్ అయిపోతారు. అంతకు మించి మహేష్ నోటి నుంచి ఒక్క తిట్టు కానీ, బూతు మాట కానీ రాదట. ఈ విషయాన్ని తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బయటపెట్టాడు.
     ఇక మహేష్ త్వరలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టుచిత్రం ద్వారా వెంకీతో కలిసి మనల్ని అలరించనున్నారు. మహేష్ మరెన్నో బర్త్ డేలు సెలబ్రేట్ చేసుకోవాలని మరెన్నో సూపర్ హిట్ లు అందించి, మనల్ని అలరించాలని ఆశిస్తూ ప్రిన్స్ కి మరోసారి బర్త్ డే విషెస్ అందిస్తోందీ..ఆంధ్రావిశేష్.కాం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Banny trivikram movie julayi release today
Invitation for pawan fans  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles