Civil case on director raghavendrarao

civil case on director raghavendrarao

civil case on director raghavendrarao

21.gif

Posted: 07/22/2012 03:25 PM IST
Civil case on director raghavendrarao

       దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా ఆయన జూబ్లీ హిల్స్‌ లో సినీమాక్స్‌ కాంప్లెక్స్‌ కట్టారని, ప్రభుత్వాన్ని మోసం చేసి వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తూ సినీ దర్శకుడు బాలకృష్ణ హైకోర్టులో పిటీషిన్‌ దాఖలు చేశారు. సినీ రంగానికి raఉపయోగపడే స్టూడియో లాంటివి నిర్మిస్తానని చెప్పి రాఘవేంద్రరావు 300 కోట్ల విలువైన భూమిని కారు చౌకగా రూ.80వేలకు ఎకరం చొప్పున చెల్లించి దక్కించుకున్నాడు. అయితే ఆయన ఆ స్థలంలో ఎలాంటి సినీ స్టూడియో, రికార్డింగ్‌, డబ్బింగ్‌ లాంటి వాటికి ఉపయోగపడే స్టూడియోలను నిర్మించకుండా సినిమాక్స్‌ కాంప్లెక్స్‌ నిర్మించి వ్యాపారం చేస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా అంటున్నారు పిటీషనర్‌. మరి కోర్టు ఈ పిటీషన్‌పై ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. ప్రస్తుతం రాఘవేంద్రరావు నాగార్జున హీరోగా 'షిరిడి సాయి'' చిత్రం రూపొందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఈనెల 25తో పూర్తి కానుంది. జులై 30వ తేదీన చిత్రం ఆడియో హైదరాబాద్‌లో రిలీజ్‌ చేస్తారు. సెప్టెంబర్‌ 6వ తేదీన సినిమా థియేటర్లలోకి రానుంది. గతంలో రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లో అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సూపర్‌హిట్‌ చిత్రాలు వచ్చిన సంగతి విదితమే..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ukup movie nizam theaters list
Eega press meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles