Eega press meet

eega press meet

eega press meet

23.gif

Posted: 07/22/2012 03:19 PM IST
Eega press meet

       సినిమా ఇండిస్టిలో నిర్మాతలుగా వెయ్యి మంది సభ్యులున్నారు. అందులో 750 మంది సినిమాలు తీయరు. మిగిలినవారు eega_eఅటుఇటుగా ఉంటారు. ఖచ్చితంగా తీసేది వందమంది నిర్మాతలే. ఆ వందమందిలో మేమున్నాం, మా సినిమాలు విడుదలతర్వాత పైరసీ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాము. అలా ప్రతి నిర్మాత చూసుకోవాలి. యాంటీపైరసీ సెల్‌ ఉందని, దాని ద్వారా మీరు జాగ్రత్తలు తీసుకోండని అందరికీ చెబుతూనే ఉన్నాం. కానీ దానికి కొంత డబ్బు చెల్లించాలని, ఆ డబ్బును వేరేరూపంలో వినియో గించుకుంటారేమోనన్న ఆలోచనల్తో వారెవరూ ముందుకు రావడంలేదని'' ఛాంబర్‌ తరఫున డి. సురేష్‌బాబు తెలిపారు. 'ఈగ' సినిమాకు ఆయన సమర్పకుడు. ప్రస్తుతం ఈగ పైరసీదారుల్ని పట్టుకున్నామని, అవన్నీ థియేటర్లలో చాటుగా కెమెరాలతో చిత్రీకరించారని, ఆ థియేటర్లు సీజ్‌ చేయిస్తున్నామని చెప్పారు. ఒకరిద్దరు నిర్మాతలే పైరసీ గురించి అడగడం మినహా మిగిలిన నిర్మాతలను ఎందుకు కలుపుకోరనే ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. రాజమౌళి మాట్లాడుతూ, సినిమా టెక్నాలజీ మారింది. అలాగే పైరసీదారుల టెక్నాలజీ మారింది. మేం చేసిన అన్ని ప్రింట్లలో గుర్తులు పెట్టాం. దానిద్వారా ఎక్కడ పైరసీ జరిగిందనేది తెలుస్తుంది. గతంలో ప్రతి థియేటర్‌లో సినిమా మధ్యలో వాచ్‌మెన్‌ వచ్చి టార్చిలైట్‌ వేసి చెక్‌చేసే వాడు. ప్రస్తుతం ఆ పద్ధతి లేదు. అందుకే అలాంటి పద్ధతి మళ్ళీరావాలని చెప్పారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Civil case on director raghavendrarao
Kajal luck  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles