Rajamouli in full josh with eega victory

rajamouli in full josh with eega victory

rajamouli in full josh with eega victory

3.gif

Posted: 07/17/2012 01:13 PM IST
Rajamouli in full josh with eega victory

      సృజనాత్మకతకు సాంకేతిక సొబగులద్ది అల్పప్రాణి ఈగను వెండితెర స్టార్ హీరోని చేసి బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు raja_in_2ప్రముఖ దర్శకుడు రాజమౌళి. నేనిప్పుడు ఈగలాగా రెండు రెక్కలతో గాల్లో ఆనంద విహారం చేస్తున్నానంటూ ఈగానందం అనుభవిస్తున్నాడీ దర్శక ధీరుడు. హైదరాబాద్ రేడియోమిర్చి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాత్రికేయులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈగ గురించి  రజనీకాంత్ ఆకాశమే హద్దన్నారు.. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ప్రసాద్ ఫోన్ చేసి రజనీకాంత్‌గారితో మాట్లాడించారు. ‘ఈగ’ సినిమాను రజనీకాంత్‌ గారు పొగడ్తలతో ముంచెత్తారు. ‘నీవు ఆకాశాన్ని అందుకున్నావు’ అని నన్ను ప్రశంసించారు.
      అంతేకాదు సుదీప్‌కు ఫోన్ చేసి దాదాపు పదిహేను నిమిషాలు మాట్లాడారు రజనీ సర్. ‘ఇంతకాలం ఇండస్ట్రీలో బెస్ట్ విలన్ నేనే అనుకున్నా..ఇంతకాలం ప్రతిభను ఎక్కడ దాచిపెట్టావు..నీతో కలసి ‘ఈగ’ సినిమా చూడాలనివుంది’ అని రజనీకాంత్‌గారు సుదీప్‌తో అన్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్  ఈగను  హాలీవుడ్‌లోకి raja_inతీసుకెళ్లమన్నారు. ఫోన్‌చేసి ‘ఈగ’ గురించి ప్రత్యేకంగా ప్రశంసించారు. అయితే ఆయన ఫోన్ చేసినప్పుడు సినిమాలోని గ్రాఫిక్స్, డి.ఐ.లాంటి సాంకేతికాంశాల గురించి మాట్లాడుతారనుకున్నా..అయితే గ్రాఫిక్స్ కంటే ఈగకు భావోద్వేదాల్ని ఆపాదించడాన్ని శంకర్ అభినందించారన్నారు.
       త్వరలో ఈగ సినిమాను 2డి, 3డి వెర్షన్‌లో హిందీలోకి.. తీసుకెళ్లే ఆలోచన ఉందన్నారు. సినిమా విడుదలకు ముందే హిందీలో శాటిలైట్ రైట్స్ కోసం ఐదుకోట్ల ఆఫర్ వచ్చింది. 3డిలోకి కన్వర్ట్ చేయాలంటే నాలుగు నెలల సమయం పడుతుంది. ఈ మధ్యనే కొన్ని బిట్స్‌ ను 3డిలో రూపొంది చూశాం. అద్భుతంగా అనిపించింది. హిందీ వెర్షన్ గురించి త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తాను. ‘‘ఈగ’తో హిట్‌కొట్టారు...మీకు ఇక హీరోలు అవసరం లేదా’ అన్న ప్రశ్నకు.. ‘రాజమౌళికి హీరోలు అవసరం లేదు. హీరోలకి రాజమౌళి అవసరం లేదు. నా ఉద్దేశ్యంలో కథప్రకారమే ఒకరి అవసరం ఒకరికి వుంటుంది. సింహాద్రి, మగధీర లాంటి సబ్జెక్ట్స్‌లో హీరో ఇమేజ్ పనిచేస్తుంది. అదే ‘ఈగ’ విషయంలో కథే ప్రధానం. ఈ కథలో హీరోలు అవసరం లేదన్నారు. తదుపరి చిత్రం గురించి ప్రశ్నించగా, ప్రస్తుతం ‘ఈగ’విజయాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నాను. కొద్దిరోజలు తర్వాతే తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తాను. తొమ్మిది సినిమాలు సక్సెస్ అయ్యాయని నేనెప్పుడు గర్వంగా ఫీలవ్వను. నా పదో సినిమాను కూడా మొదటి చిత్రంగా భావించి పనిచేస్తానని వినమ్రంగా చెప్పాడు దర్శకథీరుడు రాజమౌళి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywood movie cocktail remake in telugu
New movie bhai bharo mato shooting in progress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles