క్రియేటివ్ డైరెక్టర్డు ఎస్.ఎస్ రాజమౌళి తీసిన అద్భుత గ్రాఫికల్ మానియా ” ఈగ” చిత్రం నైజాం మొదటి వారం కలెక్షన్స్ వెల్లడయ్యాయి. ఈగ విడుదలైన 6వ రోజు ముగిసే సమయానికి నైజాంలో 6.83 కోట్ల షేర్ వచ్చింది. నిన్న సాయంత్రానికి ఈ చిత్రం 7.45 కోట్ల షేర్ సాధించింది. ఒక పెద్ద కమర్షియల్ హీరోలేని ఈ చిత్రం మొదటి వారం ఇంతటి అసాధారణ కలెక్షన్లు సాదించడం అనేది చెప్పుకోదగ్గ విషయం. ఈ చిత్రానికి ఇంతటి భారీ ఓపెనింగ్స్ రావడానికి మరియు ఇంత విజయవంతంగా ప్రదర్శించబడటానికి గల క్రెడిట్ మొత్తం ఎస్.ఎస్ రాజమౌళి గారికే చెందుతుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. విడుదలైన ప్రతి చోటా ఎంతో విజయవంతంగా ప్రదర్శించ బడుతోంది మరియు ఇక్కడి కలెక్షన్లకి ఓవర్సీస్ కలెక్షన్లు కూడా కలిపితే మొదటి వారం మొత్తం కలెక్షన్లు ఓ రేంజ్ లో ఉంటాయని మనం ఊహించవచ్చు. ఈ చిత్రాన్ని ఇంకా విజయవంతం చేసేందుకు ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమంలో రాజమౌళి టీం బిజీగా పర్యటనలు చేస్తోంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more