Must watch viewo of ramcharan wedding

must watch viewo of ramcharan wedding

must watch viewo of ramcharan wedding

12.gif

Posted: 06/14/2012 05:59 PM IST
Must watch viewo of ramcharan wedding

5e    చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌, ఉపాసన వివాహం కన్నులపండువగా జరిగిందని చిరంజీవి సోదరుడు నాగబాబు తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆద్యంతం ఆనందంగా ఈ వేడుక జరిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగే మ్యారేజ్‌ రిసెప్షన్‌కు సంబంధించి ఆహుతులకు నాగబాబు కొన్ని సూచనలను చేశారు.
     కాగా,  మెగా ఇంట జరుగుతున్న పెళ్లి సందడికి తారాలోకం తరలివచ్చింది. గండిపేట టెంపుల్ ట్రీం ఫాం హౌస్ లో జరుగిన చరణ్ – ఉపాసనల పెళ్లికి రాజకీయ, సినీ రంగాలకు చెందిన మహామహ అతిథులు తరలివచ్చారు. అలనాటి, నేటి మేటి తారలు, హీరోలు, హీరోయిన్లు, సినీ పరిశ్రమకు చెందిన  నటులు, దర్శకులు అంతా సందడి చేశారు. దీంతో పెళ్లి జరుగుతున్న టెంపుల్ ట్రీ ఫాం హౌస్ ప్రాంగణం అంతా సందడి నెలకొంది. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్ తదితరులంతా అతిథులకు సాదర స్వాగతం పలికారు.
       గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సుబ్బి రామి రెడ్డి, జానా రెడ్డి, రఘువీరా రెడ్డి, డిఎల్ రవీంద్ర రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సి.రామచంద్రయ్య, వి.హనుమంత రావు, మధు యాష్కీ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు గవర్నర్ రోశయ్య, హర్ష కుమార్, కెసిఆర్ తదితరులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలోని టెంపుల్ ట్రీ ఫాంహౌస్‌లో పూర్తి సాంప్రదాయబద్దంగా వివాహవేడుక జరిగింది.
     సినీ రంగ ప్రముఖుల్లో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, బోనీ కపూర్, అంబరీష్, దాసరి నారాయణ రావు, మురళీ మోహన్, పవన్ కళ్యాణ్, నాగబాబు, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, రాఘవేంద్ర రావు, అశ్వనీదత్, కెఎస్ రామారావు, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, వేణుమాదవ్ బ్రహ్మానందం, శ్రీకాంత్, ఊహ, రామానాయుడు, కోడి రామకృష్ణ, దగ్గుపాటి రాణా, కోట శ్రీనివాస రావు, కైకాల సత్యనారాయణ, బోయపాటి శ్రీను, సుమలత, ఎస్వీ కృష్ణా రెడ్డి తదితరులు నటీనటులు, దర్శక, నిర్మాతలు వచ్చారు.
     నభూతో..నభవిష్యతి అన్న రీతిన జరిగిన పెళ్లి వేడుక హెచ్ డి  క్వాలిటీ వీడియో ను మీకోసం అందిస్తున్నాం. పెళ్లిలోని అత్యంత కీలకమైన ఘట్టాలను కనులారా చూసి ఆనందించండి...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samantha call sheets to shankar
Another multi starer movie starts today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles