Samantha call sheets to shankar

samantha call sheets to shankar

samantha call sheets to shankar

14.gif

Posted: 06/14/2012 07:40 PM IST
Samantha call sheets to shankar

     మణిరత్నం సినిమా 'కడల్' నుంచి తప్పుకున్న చెన్నయ్ సుందరి సమంతా, తాజాగా దర్శకుడు శంకర్ కి పెద్ద మొత్తంలో డేట్స్ ఇచ్చిందట. విక్రమ్ హీరోగా శంకర్ రూపొందించే చిత్రంలో సమంతా కథానాయికగా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. saeఈ చిత్రం షూటింగు రేపటి (శుక్రవారం) నుంచి చెన్నయ్ లో జరుగుతుంది. 'తెర్డాల్' పేరుతో రూపొందే ఈ చిత్రం రాజకీయ నేపథ్యంతో సాగుతుందనీ, తమిళనాడు రాజకీయాలతో బాటు దేశ రాజకీయాలపై కూడా ఇందులో వ్యంగ్యాస్త్రాలు ఉంటాయనీ అంటున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి పీసీ శ్రీరాం చాయాగ్రహణ బాధ్యతల్ని వహిస్తున్నాడు. కాగా, 60 రోజుల పాటు ఏకధాటిగా లండన్లో 'తాండవం' చిత్రం షూటింగులో పాల్గొని హీరో విక్రమ్ రెండు రోజుల క్రితమే చెన్నయ్ చేరుకున్నాడు.  
      ఇదిలా ఉండగా,   నయనతార తాజాగా ఓ లక్కీ చాన్స్ సొంతం చేసుకుంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం చిత్రంలో నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. మణి రూపొందిస్తున్న 'కడల్' చిత్రంలో ప్రత్యేక పాత్ర ఒకటుంది.nayan అది నయన్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మణి ఆమెను అడిగాడట. అడిగిందే తడవుగా ఆమె దానికి ఓకే చెప్పేసిందనీ, అసలు పాత్ర ఏమిటి? కథ ఏమిటి? అన్న విషయాలు కూడా అడగలేదనీ తెలుస్తోంది.  మణి డైరెక్షన్లో నటించే అవకాశం రావడమే పెద్ద అదృష్టమనీ, అందుకే ఆమె వెంటనే ఆనందంగా ఒప్పేసుకుందనీ అంటున్నారు. ఇదిలా ఉంచితే, మొదట్లో ఈ చిత్రంలో కథానాయికగా ఎంపికైన సమంతా తాజాగా ఈ ప్రాజక్టు నుంచి తప్పుకున్న సంగతి మనకు తెలిసిందే. ఆమె స్థానంలో రాధ రెండో కూతురు, కార్తీక సోదరి అయిన తులసి ఎంపికైంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh do like young tiger
Must watch viewo of ramcharan wedding  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles