Mega kamineni family prayers at domakonda

mega kamineni family prayers at domakonda

mega kamineni family prayers at domakonda

3.gif

Posted: 06/12/2012 06:01 PM IST
Mega kamineni family prayers at domakonda

       చరణ్ - ఉపాసన పెళ్లికి ముందస్తు పూజాకార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కొన్నిరోజులుగా వీళ్ళిద్దరూ కూడా తమ కుటుంబాలకి సంబంధించిన సంప్రదాయాల ప్రకారం దైవ దర్శనాల్లో ... ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం చరణ్ - ఉపాసన నిజామాబాద్ సమీపంలోని 'దోమకొండ' కోటకి చేరుకున్నారు.5eee అక్కడ వెలసిన కోట మైసమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపాసన పూర్వీకుల కాలం నుంచీ కోట మైసమ్మకి పూజలు నిర్వహించడం ఆనవాయతీగా వస్తోందట.  ఈ కారణంగానే ఇక్కడ జరిపిన పూజల్లో ఇరు కుటుంబాలకి చెందిన పెద్దలు కూడా పాల్గొన్నారు. పూజాది కార్యక్రమాలు పూర్తి కాగానే, 'దోమకొండ' కి చెందిన 1000 మంది నిరుపేద స్త్రీలకి ఉపాసన చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. ఖరీదైన ఈ జంటని చూడటానికి భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు, దూరం నుంచే ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పెళ్లి కారణంగా 'దోమకొండ' కోటకి మరమ్మత్తులు జరపడం పట్ల వాళ్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చరణ్, ఉపాసనల వాహనాన్ని చిరంజీవి స్వయంగా డ్రైవ్ చేస్తూ తీసుకొచ్చారు. దీంతో ఆప్రాంతంలో కోలాహల వాతావరణం చోటుచేసుకుంది.
     5f3e ఇదిలా ఉండగా,  తన జీవితంలో ఎప్పుడూ లేనంత బిజీగా, విరామం, విశ్రాంతి అన్నవి లేకుండా చిరంజీవి గత కొన్ని రోజులుగా కనిపిస్తున్నారు. దీనికి కారణం... ఓ పక్క రాష్ట్రంలో బై ఎలక్షన్లు రావడం... మరోపక్క తన తనయుడు రామ్ చరణ్ వివాహం జరగనుండడం! కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చిరంజీవికి పార్టీలో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి, ఎలక్షన్లలో పార్టీ అభ్యర్ధుల విజయభారాన్ని ఆయనపైన కూడా వుంచడంతో, ఇటీవలి కాలంలో ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిమిత్తం విస్తృతంగా పర్యటించారు. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా ఆయన చెమటోడ్చారు. ఇదే సమయంలో, మరోపక్క తను ఎక్కడ వుంటే అక్కడి నుంచే చరణ్ వివాహ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ వచ్చారు. ఫోన్లలోనే తగు సూచనలను ఇస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో, హైదరాబాదుకు వచ్చి, ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండానే చరణ్ పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గత నాలుగైదు రోజుల నుంచీ ప్రతి రోజూ వివాహంలో భాగంగా విందులూ వినోదాలూ కొనసాగుతున్నాయి. ఆ కార్యక్రమాలలో కూడా ఆయన అంతే ఉత్సాహంతో పాల్గొంటున్నారు. నిన్న రాత్రి అతిరధమహారధులు విచ్చేయటమేకాకుండా, కన్నుల పండువగా జరిగిన 'సంగీత్' కార్యక్రమం ముగియగానే, ఉదయమే బయలుదేరి నిజామాబాద్ సమీపంలోని దోమకొండ కోటకు వెళ్లి అక్కడి వేడుకలో కూడా చురుకుగా పాలుపంచుకున్నారు. ఇక చరణ్ వివాహం అయ్యాకనే, అంటే ఈ నెల 15 తర్వాతే ఆయన కాస్త రెస్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది చిరూకు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyans gift
Krishna district slang in svsc movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles