Balayya adhinayakudu release today

balayya adhinayakudu release today

balayya adhinayakudu release today

7.gif

Posted: 06/01/2012 01:40 PM IST
Balayya adhinayakudu release today

     bala_e బాలకృష్ణ కథానాయకుడుగా నటించిన 'అధినాయకుడు' ఎట్టకేలకు ఈ ఉదయం తెరలను తాకింది. జగన్ పార్టీ ఈ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపధ్యంలో అసలు ఇవాళ ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనేదానిమీద అందరికీ అనుమానం నెలకొంది. ఈ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ బాలయ్య బాబు త్రిపాత్రాభినయంతో ప్రేక్షకులకు కనువిందు చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఎలా ఉంది అనేదానిమీద మిశ్రమ స్పందన వినిపిస్తున్నప్పటికీ, మొత్తంమీద సినిమా ఫర్వాలేదని టాక్. ఫస్టాఫ్ బాగుందని చాలా మంది అంటున్నారు. రాబోయే రోజుల్లో సినిమా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుంటుందని చిత్ర విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని రిలీజ్ చేసిన ఈ బాలయ్య సినిమా నిర్మాతను ఆదుకుంటుందనే అంతా ఆశిస్తున్నారు. bala_in2

      ఇక ఈ సినిమా మీద నెలకొన్న కొన్ని ఫిర్యాదుల నేపధ్యంలో ఈ చిత్రాన్ని ఎన్నికల సంఘం నియమించిన నిపుణుల కమిటీ ఇవాళ వీక్షిస్తుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ భన్వర్ లాల్ మీడియాకు తెలియజేశారు. కమిటీ ఇచ్చే రిపోర్టును బట్టి, ఆ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు, సంభాషణలు ఉన్నట్టయితే ఏం చేయాలన్నది నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. అయితే, చిత్రాన్ని ఆపే అధికారం తమకు లేదని, ఇది సినిమా ప్రచారంలా ఉందా? లేదా? అన్నదే తాము పరిశీలిస్తామన్నారు. ఈ సినిమాలో తమను అవమానించే రీతిలో సన్నివేశాలున్నాయంటూ వయ్యస్సార్ సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇది ఒక పార్టీకి అనుకూలంగా ఉందంటూ సమైక్యాంద్ర JAC కూడా ఫిర్యాదు చేసింది. ఎన్నివివాదాలు రేగినప్పటికీ ఈ మూవీని నిలిపివేయటంగాని లేదా భారీగా సీన్స్ కట్ చేసే పరిస్థితి ఉత్పన్నం కాదని సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Another 24 hours entertainment channel coming
Gabbar singh sequel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles