Ram gopal varama rakta charitra

ram gopal varama rakta charitra

ram gopal varama rakta charitra

19.gif

Posted: 05/08/2012 07:10 PM IST
Ram gopal varama rakta charitra

       మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు మలిశెట్టి భాను కిరణ్ అలియాస్ భాను కేసులో దర్శకుడు రాంగోపాల్‌వర్మను విచారించాలని సీఐడీ అధికారులు నిశ్చయించినట్టుగా తెలిసింది. రాయలసీమ పాలెగాళ్ల కథ ఆధారంగా రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్తచరిత్ర సినిమాకు ఫైనాన్స్ చేయటమే కాకుండా, అతడిని ఫ్యాక్షన్ ప్రాంతాలకు తీసుకెళ్లినట్టు భాను విచారణలో వెల్లడించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.ramffff రాంగోపాల్‌వర్మను ఫ్యాక్షన్ ఏరియాలకు తీసుకెళ్లినపుడు తనతోపాటు సినీ నిర్మాత చిల్లర కళ్యాణ్ కూడా ఉన్నట్టు భాను చెప్పిన నేపథ్యంలో అతన్ని కూడా ప్రశ్నించాలని భావిస్తున్నట్టు తెలియవచ్చింది. సూరిని చంపిన తరువాత పరారైన భానును పదిహేను నెలల తరువాత సీఐడీ అధికారులు జహీరాబాద్ ప్రాంతంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
      ఫ్యాక్షన్ గొడవల కథతో రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్తచరిత్ర సినిమాకు తానే ఫైనాన్స్ చేసినట్టుగా భాను సీఐడీ కస్టడీలో ఉన్నపుడు వెల్లడించాడని సమాచారం. ఆ సినిమా తీస్తున్నపుడే రాంగోపాల్‌వర్మతో తనకు పరిచయం ఏర్పడినట్టుగా తెలియచేశాడు. రక్తచరిత్ర సినిమా పూర్తికాకముందే చిల్లర కళ్యాణ్‌కు చెందిన బాలాజీ కలర్ ల్యాబ్ నుంచి రెండు రీళ్లు తీసుకెళ్లినట్టు వెల్లడించాడు. రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు చూపించటానికే ఆ రీళ్లను తీసుకెళ్లినట్టు తెలిపాడు. రక్తచరిత్ర సినిమా కోసం బెంగళూరులో రెండు థియేటర్లను కూడా బుక్ చేసినట్టు చెప్పాడు. కస్టడీలో ఉన్నపుడు భాను వెల్లడించిన ఈ వివరాల నేపథ్యంలోనే దర్శకుడు రాంగోపాల్‌వర్మను ప్రశ్నించాలని సీఐడీ అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Daggu bati rana in department movie
Online booking for movie tickets soon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles