Hero balakrishna movie srimannnarayana shooting going on in hyderabad

hero balakrishna movie srimannnarayana shooting going on in hyderabad

hero balakrishna movie srimannnarayana shooting going on in hyderabad

1.gif

Posted: 04/17/2012 12:20 PM IST
Hero balakrishna movie srimannnarayana shooting going on in hyderabad

                bla_inn11 బాలకృష్ణ కథానాయకుడుగా రవి చావలి దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్రీమన్నారాయణ' చిత్రం రెండో షెడ్యులు షూటింగు మొదలైంది. ఇవాళ కూడా హైదరాబాదు గచ్చిబౌలి లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో బాలకృష్ణ, ఫైటర్లపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పార్వతి మెల్టన్ కథానాయికగా నటిస్తున్న ఈచిత్రం తొలి షెడ్యులు షూటింగు కొన్ని రోజుల క్రితం హైదరాబాదులోనే జరిగిన సంగతి తెలిసిందే.
            ముందు జర్నలిస్ట్ గా బాలయ్యబాబు ఈ మూవీలో కనిపిస్తారనుకున్నప్పటికీ విశ్వసనీయ సమాచారం ప్రకారం బాలయ్య ఈ సినిమాలో ప్రొఫెసర్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్లో ఫ్లవర్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై  ఆమధ్య 'మిరపకాయ్' చిత్రాన్ని నిర్మించిన రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.  బాలకృష్ణ సరసన ఇషా చావ్లా సైతం నటిస్తున్న ఈ చిత్రానికి రవ చావాలి దర్శకత్వం వహిస్తున్నాడు.
            మరోవైపు బాలకృష్ణ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ ఇటీవల కేరళలోని పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. మంచు మనోజ్, దీక్షా సేథ్ ఇందులో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Heroines remunerations
Gabbar singh kevvvu keeka song shooting starts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles