కెవ్వు...కేక కాదు., ఇవాళ్టినుంచి తాజాగా ఆట మొదలైంది. నిన్న 'గబ్బర్ సింగ్' ఆడియో వేడుక జరిగిన దగ్గరనుంచి అందరి నోటా అదేపనిగా 'కెవ్వు కేక' వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట ఇప్పుడు యువతని ఓ ఊపు ఊపేస్తోంది. ఆడియో ఫంక్షన్లో వచ్చిన రెస్పాన్స్ చూస్తే ... ఈ ఆల్బం లో ఎక్కువ మార్కులు ఈ పాటకే దక్కాయేమో అనిపించేలా హాల్ అదిరిపోయిన సంగతి చూస్తే నే అర్థమైపోయింది.
ఇక పోతే, ఈ ఐటంసాంగుకి సంబంధించిన చిత్రీకరణ ఈ రోజు నుంచి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లోని ఏడెకరాల స్థలంలో జరుగుతోంది. మలైకా అరోరాతో పాటు మరికొందరు జూనియర్లపై ఈ పాటని ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో మలైకాని చూస్తుంటే మతిపోతోందని సమాచారం. అందుకే పాటకొచ్చి మలైకా అరోరాకి కోటి రూపాయల వరకూ ముట్టజెప్పారేమో.
రేపో మాపో పవన్ ఈ పాట చిత్రీకరణలో జాయిన్ అవుతాడని చెబుతున్నారు. అన్ని హంగులూ అద్దడం పూర్తైన తరువాత ఈ సినిమాని మే రెండవవారంలో విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకేముంది....కెవ్వు....కేకే..
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more