Sitamma vakitlo sirimalle chettu shooting delay

sitamma vakitlo sirimalle chettu shooting delay

sitamma vakitlo sirimalle chettu shooting delay

8.gif

Posted: 04/12/2012 10:00 PM IST
Sitamma vakitlo sirimalle chettu shooting delay

             Mahesh-Venkatesh-innప్రకాష్ రాజ్ పాత్ర విషయంలో తలెత్తిన వివాదం కారణంగా, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా షెడ్యూల్ ప్లానింగ్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా షూటింగ్ విషయంలో విపరీతమైన ఆలస్యం అవుతోందని తెలుస్తోంది.  దాంతో ... దసరా సెలవలకి ఈ సినిమాని విడుదల చేయాలనుకున్న దిల్ రాజు, 'సంక్రాంతి' కి పోస్ట్ పోన్ చేయాలనుకున్నాడట. ఈ సంగతి తెలిసి దిల్ రాజు పై మహేష్ బాబు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తన సినిమాల మధ్య గ్యాప్ ఎక్కువ ఉండకుండా ప్లాన్ చేసుకున్నాననీ, ఎట్టి పరిస్థితిలో దసరా సెలవులకి ఈ సినిమా విడుదల కావాలని మహేష్ తేల్చి చెప్పాడని అంటున్నారు. అవసరమైతే డేట్స్ సర్దుబాటు చేస్తాననీ, మిగతా ఆర్టిస్టుల డేట్స్ మాట్లాడుకోమని కాస్త గట్టిగానే చెప్పాడని సమాచారం. మరి ఈ వ్యవహారం ఎలా కుదుటపడుతుందో మరి. 
           కాగా, దిల్ రాజు నిర్మాతగా శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా వ్యవహరిస్తోన్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం షూటింగ్, ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రామలక్ష్మణులు వంటి ఇద్దరు అన్నదమ్ములు, తండ్రి కిచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం ఎలాంటి త్యాగాలకి సిద్ధపడ్డారనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh audio track
Hero aakash doing story screen ply and direction for his latest movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles