Top director trivikram srinivas interested about iliyana

top director trivikram srinivas interested about iliyana

top director trivikram srinivas interested about iliyana

6.gif

Posted: 04/09/2012 01:54 PM IST
Top director trivikram srinivas interested about iliyana

            trivi ఎందుకో...ఏమో...తెలియదు కానీ..  త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కి ఇలియానా అంటే ఎంతో ఇష్టం. ఈ మధ్య హిట్టు లేక బ్యాడ్‌ పిరియడ్‌లో ఉన్న ఆమెను, పట్టు పట్టి మరీ 'జులాయి' సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నాడు త్రివిక్రమ్.  అక్కడితోనే అయిపోలేదు. మళ్లీ ఇప్పుడు తన దర్శకత్వంలో రూపొందే మరో చిత్రంలో కూడా ఆమెనే హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేశాడని ఫిల్మ్ నగర్ వర్గాల తాజా సమాచారం. పవన్‌కళ్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో ఇలియానాని కథానాయికగా బుక్‌ చేశారని తెలుస్తోంది. బివియస్‌ఎన్‌.ప్రసాద్‌ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్‌ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. అక్టోబర్లో ఈ సినిమా సెట్స్‌కు వెళుతుందని అంటున్నారు.
              ప్రస్తుతం త్రివిక్రమ్‌ 'జులాయి' సినిమాతోనూ, పవన్‌ కళ్యాణ్‌ 'గబ్బర్‌సింగ్‌', 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాలతోనూ బిజీగా వున్నారు. ఇవి పూర్తయిన వెంటనే, పవన్‌కళ్యాణ్‌, ఇలియానా సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ili
           ఇదిలా ఉండగా అల్లు అర్జున్‌, ఇలియానా జంటగా  త్రివిక్రమ్‌ దర్శకత్వంలో, ఎస్‌.రాధాకృష్ణ నిర్మాతగా హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘జులాయి’ ఈ సమ్మర్‌లో విడుదలకు సిద్ధమవు తోంది. ఫస్ట్ లుక్ తోనే ఈ చిత్రం యమ క్రేజ్ ని సొంతం చేసుకుంది.  ఈ చిత్రం ఇప్పటికే నాలుగు పాటలు మినహా షూటింగ్‌ పూర్తికావచ్చింది. మే చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.  ప్రస్తుతం పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. త్వరలో విదేశాలలో షూట్ చేసేందుకు చిత్ర వర్గం సన్నాహాల్లో ఉంది. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli eega hal chal in social network sites
Happy birth day wishesh to banny  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles