Mahesh babu kajal new movie shooting will begin in

mahesh babu kajal new movie shooting will begin in..

mahesh babu kajal new movie shooting will begin in..

4.gif

Posted: 04/05/2012 01:46 PM IST
Mahesh babu kajal new movie shooting will begin in

          mahe_kaju 'బిజినెస్ మేన్' చిత్రం తర్వాత కొంత రెస్ట్ తీసుకుంటూ షూటింగ్ లో పాల్గొంటున్న ప్రిన్స్ ఇక బిజీ అయిపోబోతున్నారు. వెరైటీ దర్శకుడు సుకుమార్ ఆధ్వర్యంలో తెరకెక్కబోయే మహేష్ బాబు, కాజల్ చిత్రం షూటింగును ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్ర నిర్మాణం చేస్తుంది. mahe_suku
            ఈ నెల 23 న హైదరాబాదులో ఓ పాట చిత్రీకరణతో ఈ చిత్రం షూటింగును ప్రారంభిస్తారు. అది పూర్తయిన వెంటనే యూనిట్ బ్యాంకాక్ షిఫ్ట్ అవుతుందనీ, తొలి షెడ్యూల్లో చాలా భాగంగా మహేష్-కాజల్ మీద రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం. సినిమాలోని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ కూడా అక్కడ నిర్వహిస్తారు. గోవా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్ర కథ నడుస్తుందని తెలుస్తోంది. అందుకే, సముద్ర తీరానికి చెందిన లొకేషన్లను ఎంచుకుంటున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా మహేష్ బాబు లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నారు.mahe_family
           ప్రస్తుతం మహేష్ బాబు ఎక్కువ సమయాన్ని తన భార్య, బాబు కోసం కేటాయిస్తున్నాడు. ఆమధ్య 'దూకుడు' సినిమా నుంచి గ్యాప్ లేకుండా షూటింగుల మీద షూటింగులు జరిపిన మహేష్.. భార్య నమ్రత, ముద్దుల కొడుకు గౌతమ్ కృష్ణ లతో కలిసి హాలిడే కోసం సింగపూర్ లో గడిపారు.  ఈ నెల 11వ తేదీ నుంచి తిరిగి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం షూటింగ్ లోనూ అనంతరం సుకుమార్ చిత్రంలోనూ నటిస్తూ  యమజిజీ అయిపోబోతున్నాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rihanna battleship hollywood movie
Young hero manchu majoj tweet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles