బిజీ షెడ్యూల్స్ తో తీరికలేకుండా ఉండే సినీరంగానికి చెందినవారిని కొందరు కుట్రదారులు ఇట్టే మోసం చేసేస్తున్నారు. తప్పుడు పత్రాలు స్రుష్టించి అక్రమ భూములు అంటగట్టి భారీగా డబ్బుకొల్లగొడుతున్నారు. ఇక కోర్టుల చుట్టూ తిరగాల్సి రావటం అమాయకుల వంతవుతోంది. ఇదే తరహాకు చెందిన ఓ భూవివాదంలో హీరోయిన్ అనుష్క, రమారాజమౌళి మరో ఐదుగురు చిక్కుకున్నారు.
రెండేళ్ల క్రితం వీరంతా కలిసి విశాఖపట్నం జిల్లా మధురవాడ గ్రామంలో కొంత భూమిని కొనుగోలు చేశారు. అత్యంత ఖరీదైన ఆ భూమికి అసలు యజమాని లింగమూర్తి. అమెరికాలో ఉంటోన్న అతనికి తెలియకుండా కొందరువ్యక్తులు తప్పుడు పత్రాలను సృష్టించి, ఆ స్థలాన్ని అనుష్క వాళ్లకి అంటగట్టారట. ఈ సంగతి తెలుసుకున్న ఆ స్థలం యజమాని భీమునిపట్నం కోర్టును ఆశ్రయించడంతో, కోర్టు వీరికి సమన్లు పంపించింది.
అయితే, ఈ విషయంలో తమకి మరింత స్పష్టత రావాల్సి ఉందనీ, తగిన ఆధారాలతో హాజరయ్యేందుకు గడువుకావాలంటూ వీరు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. స్టే పొందిన కారణంగా కేసు వాయిదా వేయాలంటూ అనుష్క తరఫు న్యాయవాది కోరడంతో, కోర్టు ఈ కేసును ఏప్రిల్ 16 కి వాయిదా కోర్టు వాయిదావేసింది. ఈ తలపోటు నుంచి వీరు ఎలా ఉపశమనం పొందుతారో వేచిచూడాలి.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more