Actor vikram and surya clash on small screen

Two of the superstars of Tamil film industry are ready to clash on small screen. The duo, who was seen together in award winning film Pithamagan, will be in the TRPs war in the coming months. Yes, Vikram and Surya, the two actors known for varieties, will be hosting television game shows soon

Two of the superstars of Tamil film industry are ready to clash on small screen. The duo, who was seen together in award winning film Pithamagan, will be in the TRPs war in the coming months. Yes, Vikram and Surya, the two actors known for varieties, will be hosting television game shows soon

Actor Vikram and Surya clash on small screen.gif

Posted: 02/11/2012 06:02 PM IST
Actor vikram and surya clash on small screen

Surya_Vikram

సినిమా హీరోలు సినిమాల పరంగా వెండి తెర పై పోటీ పడుతుంటారు. ఎవరి సినిమాకు ఎక్కువ డబ్బులు వచ్చాయి, ఎవరి ఇమేజ్ ఎంత పెరిగింది అని ఎప్పటి కప్పుడు వెండితెర పై నెం.1 కావడానికి పోటీడటం చూశాం. కానీ తెలుగు తమిళ టాప్ హీరోలుగా పేరు తెచ్చుకున్న విక్రమ్, సూర్యలు ఇప్పుడు బుల్లి తెర పై పోటీ పడుతున్నారు. వీరు వెండి తెరను కాకుండా బుల్లి తెరను కూడా ఏలబోతున్నారు. బాలీవుడ్ ప్రముఖ హీరోలు బుల్లి తెర పై రాణించి మంచి క్రేజ్ తో పాటు మంచి బిజినెస్ కూడా చేసుకున్నారు. బాలీవుడ్ హీరోలు అయిన అమితాబ్, షారూక్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ లాంటి వాళ్ళు బుల్లి తెర పై రాణించి పేరొందిన విషయం తెలిసిందే. తెలుగులో ప్రముఖ హీరోలు బుల్లి తెర ప్రవేశం చేయలేదు. తెలుగు లో ప్రస్తుతం సాయికుమార్, ఆలీ లాంటి వాళ్ళు మాత్రమే బుల్లి తెర పై ప్రోగ్రామ్ లు చేస్తున్నారు.

అయితే  ఇప్పుడు తమిళ హీరోలు విక్రం, సూర్య ఇప్పుడు తమిళంలోని చెరో టీవీ చానెల్ కూ ఒక్కో కార్యక్రమాన్ని ప్రెజంట్ చేయనున్నారు. ఇప్పటికే సూర్య 'కౌన్ బనేగా కరోడ్ పతి' తమిళ వెర్షన్ ప్రజంట్ చేయడానికి కమిట్ అయ్యాడు. ఆ షూటింగుకు డేట్స్ కూడా ఇచ్చేశాడు. త్వరలో ఇది బుల్లితెర మీదకు రానుంది. ఈ నేపథ్యంలో మరో కొత్త కాన్సెప్ట్ తో ఇంకో టీవీ చానెల్ విక్రం ని సంప్రదించిందట. అది నచ్చడంతో ఆయన కూడా  దానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. రేపు ఇద్దరి కార్యక్రమాలు ప్రారంభమయ్యాక ఎవరి ప్రోగ్రాం కి ఎక్కువ టీఆర్పీ వస్తుందో చూడాలి. అంతేకాకుండా వీరు బాలీవుడ్ హీరోల్లా పేరు తెచ్చుకుంటారో లేదో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Esha deol to get engaged to businessman beau
Pawan kalyan acting in mani ratnam flim  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles