Pawan kalyan new movie directed by poori jagannath first half script ready

pawan kalyan, new movie ,directed by poori jagannath , first half script ready,

pawan kalyan new movie directed by poori jagannath , first half script ready

12.gif

Posted: 02/10/2012 06:30 PM IST
Pawan kalyan new movie directed by poori jagannath first half script ready

         pawan తెలుగు చిత్ర ప్రేమికులు పవన్ అభిమానులు ఎంతో ఎదురు చూస్తోన్న పవన్-పూరీ క్రేజీ కాంబినేషన్ మళ్లీ సాక్షాత్కారం కాబోతోన్న సంగతి తెలిసిందే.  తనకు తొలిసారి దర్శకుడిగా అవకాశం కల్పించి ప్రోత్సహించిన పవర్ స్టార్ పవన్ కళ్ల్యాణ్ తో తీసే మరో సినిమా సంచలనం చేయాలని పూరీ తలపోస్తున్నట్టు తెలిసింది.
          poori_jaganఈ చిత్రానికి సంబంధించిన బ్రేకింగ్ ఏమంటే... ఈ సినిమా ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ ను డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇవాల్టితో పూర్తి చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. చిత్రాన్ని చాలా పగడ్బందీగా తెరకెక్కించేందుకు పూరీ చాలా శ్రమిస్తున్నట్టు వినికిడి. అంతేకాదు.. ఈ సినిమా టైటిల్ ఏంటనేది ఈరోజే వెల్లడవుతుందని తెలుస్తోంది. మెగా అభిమానులతో పాటు యావత్ చిత్ర సీమ ఎదురుచూస్తోన్న ఈ టైటిల్ ఎలా ఉంటుందో చూడాలి.
          dvv_danayyaవీరి కాంబినేషన్ లో వచ్చిన ‘బద్రి’ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా పవన్..పూరీ మరో సినిమా తెరకెక్కబోతోన్న తరుణంలో పవర్ స్టార్ అభిమానులకు మాంచి కిక్ ఇచ్చే సినిమా రాబోతోందన్నమాట.  పవన్ లేటెస్ట్ మూవీ ‘గబ్బర్ సింగ్’ సినిమా పూర్తి అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ డివివి దానయ్య నిర్మిస్తున్నారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kemera men ganga to rambabu is the title of pawan poori cinima
Ramcharan letest movie rachha audio function in karnool city  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles