Anushka new movie in director krish

Anushka New movie in director krish, Director Krish, Telugu movie reviews, Director Krish has selected Anushka to his next project,

Anushka New movie in director krish

Anushka new movie.GIF

Posted: 11/19/2011 12:10 PM IST
Anushka new movie in director krish

anushka_1

అల్లు అర్జున్, మంచు మనోజ్ ప్రదాన పాత్రల్లో రాధాకృష్ణ నకిష్) జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం ‘గమ్యం’. ఈ చిత్రంలో అమలాపురం సరోజగా నటించి విమర్శకుల ప్రశంసలందుకున్న అనుష్క మరోసారి ఆయన దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని తెలుస్తోంది. తమిళంలో ‘వేదం’ చిత్రాన్ని ‘వానం’ పేరుతో రీమేక్ చేసిన రాధాకృష్ణ జాగర్లమూడి త్వరలో రానా కథానాయకుడిగా ‘కృష్ణంవందేజగద్గురుమ్’ చిత్రానికి దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రానాకు జోడీగా అనుష్కను దర్శకుడు క్రిష్ ఎంపిక చేశాడని తెలిసింది. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాధాకృష్ణ తండ్రి జాగర్లమూడి సాయిబాబా నిర్మించనున్నారు. రానా పుట్టిన రోజైన డిసెంబర్ 14న ఈ చిత్రం ప్రారంభం కానుందని చిత్ర వర్గాల సమాచారం. ప్రస్తుతం రానా ‘డిపార్ట్‌మెంట్’, ‘నా ఇష్టం’ చిత్రాల్లో నటిస్తున్నాడు. అనుష్క ఈ చిత్రంతో పాటు రెండు తమిళ చిత్రాల్లోనూ, రెండు తెలుగు చిత్రాల్లోనూ నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri ramarajyam is my best birthday gift nayanthara
Media asking public to suggest a name for baby bachan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles