Potato beauty tips for hair problems home remedies

potato beauty tips, beauty tips, beauty tips in telugu, hair problems, hair home remedies, hair problems home remedies, potato beauty tips for hair, hair gain problems, hair loss problems, shiny hair tips

potato beauty tips for hair problems home remedies

బంగాళదుంపతో జుట్టుసమస్యకు చెక్..

Posted: 11/27/2014 06:03 PM IST
Potato beauty tips for hair problems home remedies

వివిధరకాల జుట్టు సమస్యలను నివారించుకోవడానికి మార్కెట్లో చాలారకాల ఉత్పత్తులు, పద్ధతులు అందుబాటులో వున్నాయి కానీ.. వాటిని రెగ్యులర్’గా వాడటం వల్ల అందులో వుండే రసాయనాలు మెదడుకు ఇబ్బంది కలగించవచ్చు. కాబట్టి కృత్రిమంగా తయారుచేసే క్రీములను నిరంతరం వాడటం కంటే సహజంగా లభించే కొన్ని ఆహారపదార్థాల ద్వారా జుట్టు సమస్యలను శాశ్వతంగా నివారించుకోవచ్చు.

సహజంగా లభించే పదార్థాల్లో పోషక విలువలు అధిక మోతాదులో వుంటాయి కాబట్టి వాటితో ప్రయోజనాలే కలుగుతాయి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగవు. అటువంటి వాటిల్లో బంగాళదుంప కూడా ఒకటి! ఇది జుట్టు సమస్యలను పూర్తిగా అరికట్టడంలో తనదైన పాత్రను పోషిస్తుంది. ఇది అతిపెద్ద నాలుగో పోషకాహారంగా పేరుగాంచింది కూడా. మరి ఇటువంటి దుంపతో జుట్టు సమస్యలను ఎలా అరికట్టవచ్చో తెలుసుకుందాం..

1. బంగాళదుంపను తీసుకొని దానిని ఒక నీటిలో బాగా పిండేయాలి. అందులో గుడ్డు, పెరుగు బాగా కలిపి, ప్యాక్’లా తయారుచేసుకోవాలి. దీనిని జుట్టుకు, మూలాలకు బాగా పట్టించాలి. 20 నిముషాల తర్వాత వెచ్చని నీటితో, సాధారణ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా 20 రోజులవరకు చేసుకుంటే మంచి ఫలితం దక్కుతుంది.

2. బంగాళదుంపపై వున్న తొక్కను బాగా తీసేసి పక్కనపెట్టుకోవాలి. ఒక పాన్’లో తగినంత నీరు పోసి బాగా కాచుకోవాలి. ఆ కాచిన నీటిలో పక్కన తీసిపెట్టుకున్న బంగాళదుంప పొట్టు వేసి 20 నిముషాలు మరిగించాలి. అనంతరం ఆ నీటిని ఒక గిన్నెలో వడకట్టాలి. జుట్టును సాధారణ షాంపూతో శుభ్రం చేసుకున్న తర్వాత ఆ మరిగించి వడకట్టిన నీటితో మళ్లీ జుట్టును శుభ్రం చేసకోవాలి. ఇది జుట్టుకు సహజ నలుపురంగు అందివ్వడంలో సహాయపడుతుంది. ఇలా వారంరోజులు చేస్తే మంచి ఫలితం దక్కుతుంది.

3. మూడు స్పూన్స్ బంగాళదుంప రసం,మూడు స్పూన్స్ కలబంద రసం,రెండు స్పూన్స్ తేనే తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి, రెండుగంటల తర్వాత సాధారణ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండుసార్లు ఇలా చేసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  hair problems  hair home remedies  telugu news  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more