మామూలుగా కొంత వయసు వచ్చాక జుట్టు తెల్లబడటం అనేది ఎవరికైనా సహజమే. కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా జుట్టు త్వరగా తెల్లబడిపోతోంది. ఇలాంటప్పుడు కొంచెం ఆలోచించి నివారణ ఉపాయాలు వెతకాలి. మీకు టీ, కాఫీలు ఎక్కువగా తాగే అలవాటు ఉంటే తగ్గించండి. అంతేకాదు మసాలాలు, కూడా మానేయండి. ఈ కింది జాగ్రత్తలు పాటిస్తే బాలనెరుపు సమస్య నుండి బయటపడవచ్చు.తలస్నానానికి వీలెైనంతవరకు కుంకుడుకాయలు, శీకాయి, హెర్బల్ షాంపూలనే వాడాలి. ఒక స్పూన్ కర్పూరం పొడిని కొబ్బరినూనెలో కలుపుకుని ప్రతిరోజీ మసాజ్ చేసుకోవాలి. జుట్టును తరచు నూనెతో మసాజ్ చేయడం చాలా అవసరం, వారానికి రెండుసార్లు ఆముదం కాని కొబ్బరినూనె కాని గోరువెచ్చగా వేడి చేసి తలకు బాగా మసాజ్ చేయండి. గంట తరువాత తలస్నానం చేయండి. తలస్నానం తరువాత చేతివేళ్లతో తలంతా మసాజ్ చేస్తే రక్తపస్రారం పెరిగి జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది. మల్లెతీగ వేళ్లను నిమ్మరసం కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, అరగంట తర్వాత కడిగేయాలి. కొత్తిమీర రసం జుట్టుకు నిగారింపునిస్తుంది. కాఫీ లేదా టీ డికాషన్‌లో గోరింటాకు వేసి నానపెట్టి, తల కు పట్టించి గంట తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. మెంతి పిండి గోరింటాకు, పెరుగు కలిపి పెట్టుకున్నా మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more