ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తరచూ వచ్చే చెమటతో ముఖం జిడ్డుగా అవుతోంది కదూ...! అందుకే.. చక్కని మోముకి ఈ వంటింటి చిట్కాలను ప్రయత్నించి చూడండి.
• ఎండవేడికి కళ్ళు మంటగా వుండటం, ముఖం నిస్తేజంగా మారటం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇటువంటప్పుడు పొట్టు తీసిన బంగాళదుంపని సగం వరకు చక్కాల్లా తరిగి నుదురు, కళ్లపెై పెట్టుకోవాలి. మిగిలిన సగభాగాన్ని గుజ్జులా చేసి కొంచెం తేనె చేర్చి ముఖానికి రాసుకోవాలి. ఈ ప్యాక్ పూర్తిగా ఆరాక చల్లని నీటితో తొలగించాలి. ఇది కళ్లకు సాంత్వన నివ్వడమేగాక... చర్మంపెై జిడ్డును తొలగించి తేజోవంతంగా మార్చుతుంది.
• జిడ్డు చర్మంగల వారికి కీరదోస చక్కని పరిష్కారం. దీనిని మెత్తగా గుజ్జులా చేసి రసాన్ని వేరుచేయాలి. ఇందులో పావుచెంచా నిమ్మరసం, చెంచా రోజువాటర్ చేర్చి అరగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఈ మిశ్రమాని రోజుకు రెండుసార్లు ముఖం, మెడ భాగాల్లో రాసుకొని చల్లని నీటితో శుభ్రపరచాలి. ఈ చల్లని ప్యాక్ మించి క్లెన్సర్‌లా పనిచేసి, అలసిన చర్మానికి సాంత్వననిస్తంది.
• క్యాబేజి ఆకులను ముద్దలా చేసి రసాని వేరుచేయాలి. దీనికి రెండు చెంచాల శనగపిండి, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాని ముఖానికి రాసుకొని పావుగంటయ్యాక తడి దూదితో తొలగించాలి. ఇది చర్మంపెై పేరుకొన్న మురుకిని తొలగించి కాంతివంతంగా మార్చుతుంది.
• ముల్లంగిని మెత్తని గుజ్జులా చేసి రసం వేరుచేయాలి. దీనికి రెండు చెంచాల పెరుగు చేర్చి ముఖానికి, చేతులకు రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ ఎండకు వడలిపోయిన చర్మానికి కొత్త తేజస్సునందిస్తుంది.
• పొడిచర్మం గలవారికి ఈ ప్యాక్ చక్కగా పనిచేస్తుంది. ఒక నారింజ పండు, ఐదారు కర్జూరాలను తీసుకొని గింజలు తీసివేయాలి. ఈ రెండింటిని మిక్సిలో వేసి ముద్దలా చేయాలి. దీనిని ముఖం చేతులకు రాసుకొని మునివేళ్లతో వౄఎత్తాకారంగా మర్దన చేయాలి. పావుగంట తర్వాత ఈ ప్యాక్‌ను తడిదూదితో తొలగించాలి. ఇది చర్మ కణాలకు తగిన తేమనందించి చాలా సేపటి వరకు చర్మ పొడిబారకుండా చేస్తుంది.
• పొదీన ఆకుల్ని మెత్తగా నూరి కొంచెం రోజ్‌వాటర్ చేర్చి ముఖానికి రాసుకోవాలి. ఇది మాయిశ్చరెైజర్ లా పనిచేయడమే కాకుండా... మెటిమలు, బ్లాక్ హెడ్స్‌ల్లాంటివి తొలగిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more