The Biography Of Indian 11th President APJ Abdul Kalam | Indian Presidents

Apj abdul kalam life history india 11th president

apj abdul kalam, abdul kalam history, abdul kalam biography, abdul kalam latest updates, abdul kalam funeral, abdul kalam news, abdul kalam life story, abdul kalam story

APJ Abdul Kalam Life History India 11th President : The History Of Indian Indian 11th President APJ Abdul Kalam. He is the one and only one president who got that position without any political background.

అబ్దుల్ కలాం.. అందరికీ ఆదర్శంగా నిలిచిన ‘మిస్సైల్ మేన్’

Posted: 07/28/2015 11:40 AM IST
Apj abdul kalam life history india 11th president

ఏపీజే అబ్దుల్ కలాం.. భారతదేశ 11వ రాష్ట్రపతి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈయన.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని విద్యనభ్యసించారు. కుటుంబ అవసరాలకోసం పేపర్ బాయ్ గా విధులు నిర్వహించారు. ఓవైపు తన విద్యాభ్యాసం కొనసాగిస్తూనే.. మరోవైపు కష్టాల్లో తన కుటుంబానికి అండగా నిలిచారు. అనంతరం ఆయన తన కెరీర్ ని శాస్త్రవేత్తగా ప్రారంభించారు. అణుపరీక్షల ద్వారా భారత సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన గొప్పవ్యక్తి! ఈ అణు పరీక్షలే భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చడంలో ప్రధానపాత్రధారిగా నిలిచాయి. అగ్ని క్షిపణి, పృధ్వి క్షిపణి మిస్సైళ్ళ అభివృద్ధి, ప్రయోగాలకు ప్రధానసూత్రధారి కావడంతో ఆయనకు భారతదేశపు ‘మిస్సైల్ మాన్’ అనే పేరు వచ్చింది. దేశ ప్రముఖ శాస్త్రవే, త్తఇంజనీరు కూడా అయిన ఆయన.. మన భారతదేశ 11వ రాష్ట్రపతి! 2002-2007 రాష్ట్రపతిగా దేశానికి ఎన్నో సేవలందించారు. ‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’ అంటూ యువత భవిష్యత్తుపై ఆశయం కల్పించి, నిదర్శనంగా నిలిచారు.

జీవిత విశేషాలు :

1931 అక్టోబర్ 13వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ధనుష్కోడిలో ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో అబ్దుల్ కలాం జన్మించారు. ఈయన పూర్తిపేరు.. ఈయన పూర్తి పేరు డాక్టర్ అబుల్ ఫాకిర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలామ్. ఆయన తన స్కూలు జీవితం నుంచే న్యూస్ పేపర్లను పంపిణీ చేసేవారు. ఎన్నో సమస్యల నుంచి వచ్చిన ఆయన 1958లో మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగులో పట్టా పుచ్చుకున్నారు. తర్వాత ఆయన దేశరక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డి.ఆర్.డి.ఒ.లో చేరిన ఆయన... ఒక విఫలమైన హోవర్ క్రాఫ్ట్ (hovercraft) ప్రాజెక్టు మీద పనిచేశారు. అక్కడి నుంచి 1962లో ఆయన (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) ఇస్రోకు మారారు. అక్కడ ఇతర శాస్త్రవేత్తలతో కలసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980 లో విజయవంతంగా భూమి సమీప కక్ష్యలోకి వదిలిన దేశపు మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III)ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా ఆయన కృషి ఎంతో ఉంది.

1982లో ఆయన DRDOకు డైరెక్టరుగా తిరిగి వచ్చి, గైడెడ్ మిస్సైల్ (guided missile)ల మీద దృష్టి కేంద్రీకరించారు. జూలై 1992లో ఆయన భారత దేశపు రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారు అయ్యారు. భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదా వచ్చింది. ఆయన కృషి ఫలితంగానే 1998లో పోఖ్రాన్-II అణుపరీక్షలు విజయవంతంగా జరిగాయి. భారతదేశానికి ఆయన అందించిన సేవలకుగానూ దేశంలోనే అత్యున్నత పౌరపుస్కారాలు అయిన పద్మ భూషణ్ (1981లో), పద్మ విభూషణ్(1990లో), భారతరత్న (1997లో)లతో బాటు కనీసం ముప్ఫై విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్లు పొందారు. జూలై 18, 2002న కలామ్ బ్రహ్మాండమైన ఆధిక్యతతో(90% పైగా ఓట్లతో) భారత రాష్ట్రపతిగా ఎన్నికై... జూలై 25న పదవీ స్వీకారం చేశారు. ఆయన్ను ఆ పదవికి తమ అభ్యర్థిగా నిలబెట్టింది అప్పటి అధికార పక్షమైన నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) కాగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీ మద్దతు తెలిపింది. అప్పట్లో ఎన్డీయే కన్వీనర్ గా వున్న చంద్రబాబు.. రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం పేరును సిఫారసు చేసి, ఆయన్ను బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఒప్పించారు.

రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన తిరిగి తనకు నచ్చిన రంగం (శాస్త్రీయ)లోకి చేరారు. 2020 నాటికి భారత్ ను ఆర్థికంగా అభివృద్ధి చేందిన దేశంగా మలిచే దిశగా ఈయన కృషి చేసేవారు. కానీ.. ఇంతలోనే ఈ ధృవతార నింగికెగిసింది. షిల్లాంగ్ లోని ఓ వేదికపై ప్రసంగిస్తూనే ఈ మిస్సైల్ మాన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చికిత్స నిమిత్తం దగ్గరలోనే వున్న ఆసుపత్రికి తరలించగా.. అక్కడ ఆయన తుదిశ్వాస విడిచారు. నిత్యవిద్యార్థి అని తనను తాను చెప్పుకునే ఈ గొప్ప వ్యక్తి.. అందరికీ ఆదర్శంగా నిలిచారు.

abdul-kalam-awards-image

(Image Source : Wikpedia)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : apj abdul kalam  indian presidents  

Other Articles