The Biography Of Cingireddy Narayana Reddy Who Is an Indian poet and writer | Jnanpith Award

Cingireddy narayana reddy biography indian famous poet writer jnanpith award

Cingireddy Narayana Reddy biography, Cinare Biography, Cinare Life Story, Cingireddy Narayana Reddy history, Cingireddy Narayana Reddy, cinare writings, cinare songs

Cingireddy Narayana Reddy Biography Indian Famous Poet Writer Jnanpith Award : The Biography Of Cingireddy Narayana Reddy Who Is an Indian poet and writer. He won the Jnanpith Award in 1988 and is considered to be an authority on Telugu literature.

తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు అందించిన సినారె

Posted: 07/29/2015 07:02 PM IST
Cingireddy narayana reddy biography indian famous poet writer jnanpith award

తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు చేసిన వారిలో సింగిరెడ్డి నారాయణరెడ్డి ఒకరు. ఒక మారుమూల గ్రామంలో రైతుకుటుంబంలో జన్మించిన ఈయన.. బాల్యంలోనే హరికథలు, జానపదాలు, జంగం కథలవైపు ఆకర్షితుడయ్యాడు. తెలుగు సాహిత్యంలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి, ఆ రంగానికి ఎనలేని కృషి చేశారు. ఆయన చేసిన సేవలకు గాను ఎంతో ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. తెలుగు కవి, సాహితీవేత్త అయిన ఈయన.. తెలుగు చలనచిత్ర రంగంలో ఎన్నో పాటలు రాశారు. ఈయన ‘సినారె’గా ప్రసిద్ధి చెందాడు.

జీవిత విశేషాలు :

1931 జూలై 29వ తేదీన కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామమైన హనుమాజీపేట్లో మల్లారెడ్డి, బుచ్చమ్మ దంపతులకు సినారె జన్మించాడు. ఈయన ప్రాథమిక విద్య గ్రామంలోని వీధి బడిలో సాగింది. ఈయన బాల్యంలోనే హరికథలు, జానపదాలు, జంగం కథలవైపు ఆకర్షితుడయ్యాడు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్ లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు. ఈయన చదివిన పాఠశాలలో తెలుగు భాష ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందాడు.

సికింద్రాబాదులోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా కొన్నాళ్లు పనిచేసిన సినారె.. ఆ తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారములు పొందాడు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే. విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది. ప్రముఖంగా కవి అయినప్పటికీ ఆయన కలం నుంచి పద్య-గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, సంగీత నృత్య రూపకాలు, బుర్ర కథలు, గజళ్ళు, విమర్శన గ్రంథాలు మొదలైనవి వెలువడ్డాయి. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవాడు.

విద్యార్థిదశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు. 1953లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయాలు, ప్రయోగాలకు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. 1962లో ‘గులేబకావళి కథ’ చిత్రంలోని ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ’ అనే పాటతో ప్రారంభించి, 3500 గీతాలు రచించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cinare Biography  Cingireddy Narayana Reddy  Telugu literature  

Other Articles