Tanguturi prakasam pantulu biography first chief minister andhra pradesh state

tanguturi prakasam pantulu news, tanguturi prakasam pantulu biography, tanguturi prakasam pantulu history, tanguturi prakasam pantulu telugu, tanguturi prakasam pantulu wikipedia, tanguturi prakasam pantulu life story, tanguturi prakasam pantulu story telugu, tanguturi prakasam pantulu family, tanguturi prakasam pantulu background, tanguturi prakasam pantulu photos, indian freedom fighters, simon commission, andhra kesari

tanguturi prakasam pantulu biography first chief minister andhra pradesh state : the first chief minister of andhra pradesh who is a freedom fighter from poor family

ఆంధ్రరాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం

Posted: 12/05/2014 04:26 PM IST
Tanguturi prakasam pantulu biography first chief minister andhra pradesh state

భారతదేశ స్వాతంత్ర్య సమరంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తుల్లో టంగటూరి ప్రకాశం పంతులు ఒకరు! ముఖ్యంగా సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో ఈయన పాత్ర అమోఘం! ఆనాడు తుపాకి గుండుకు ఎందుకుగా తన గుండెనుంచి కాల్చమంటూ ధైర్యంగా నిలిచిన యోధుడు. ఆయన ప్రదర్శించిన ఈ సాహసానికిగాను ‘ఆంధ్రకేసరి’గా పేరుగాంచారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లోనూ తనవంతు పాత్ర పోషించి, ప్రముఖ నాయకుడిగా ఎదిగాడు. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన ధీరోదాత్తుడు.

జీవిత విశేషాలు :

1872 ఆగష్టు 23న ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెం గ్రామంలో సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య దంపతులకు టంగుటూరి ప్రకాశం జన్మించారు. వీరి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామకరణం వృత్తిలో ఉండేది. వల్లూరులో ప్రాథమిక విద్యనభ్యసించిన ఈయన.. మిషన్ పాఠశాలలో ప్రీమెట్రిక్’లో చదివారు. అనంతరం రాజమండ్రిలో ఎఫ్.ఏ.. తర్వాత మద్రాసులో న్యాయశాస్త్రం పూర్తిచేశారు. 1890లో అక్కడ కూతురైన హనుమాయమ్మను వివాహం చేసుకున్నారు. న్యాయవాది వృత్తిలో మంచిపేరుతోబాటు పుష్కలంగా సంపదా సంపాదించుకోగలిగారు. అయితే సెకండ్ గ్రేడ్ ప్లీడర్ కావడంతో పైస్థాయి కోర్టులలో వాదించే అర్హత వుండేది కాదు. కేవలం బారిష్టర్లకు మాత్రం వుండేది. దాంతో ఆయన 1904లో ఇంగ్లాండుకు వెళ్లి.. 1907 అక్కడ బారిష్టర్ అయ్యారు.

బారిష్టర్ కోర్సు పూర్తిచేసిన అనంతరం ఇండియాకి తిరిగొచ్చి మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. తన వృత్తికాలంలో ఆయన కొంతమందికి తక్కువ శిక్షపడేట్లు వాదించారు. ఆనాడు జాతీయవాదనేత బిపిన్ చంద్రపాల్ దేశభక్తిపై ఉత్తేజభరితమైన ప్రసంగాలు చేస్తుండగా.. బ్రిటీష్ ప్రభుత్వం మాత్రం వాటిని తప్పుడు ప్రచారాలు చేసింది. పాల్ ప్రసంగాలు ఉసిగొల్పేవిగా, ఉద్రేకపూరితంగా వున్నాయని భావించడంతో ఇతరులు భయంతో వచ్చేవాళ్లు కాదు. కానీ ప్రకాశం మాత్రం ధైర్యంగా హాజరయ్యేవారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మీటింగులకు తరుచుగా హాజరుకావడం ప్రారంభించి, 1921 అక్టోబర్’లో సత్యాగ్రహ ప్రతినపై సంతకం చేశారు. అనంతరం తన వృత్తిని వదిలేసి స్వాతంత్ర్య సమరంలో అడుగుపెట్టారు.

వృత్తిపరంగా సంపాదించిన మొత్తం ఆస్తిని దేశ-ప్రజాసేవకే ఖర్చు చేశారు ప్రకాశం! ఒక జాతీయ పాఠశాలతోబాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపారు.  1921 డిసెంబర్‌లో జరిగిన అహమ్మదాబాదు సదస్సులో కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఏదైనా అలజడి లేదా కల్లోలంకానీ జరిగినప్పుడు ప్రజలను ఓదార్చేందుకూ పర్యటించేవారు. ముస్లిం-హిందూ ఘర్షణలను అణిచివేయడంలో ఎంతో కృషి చేశారు. 1922లో సహాయనిరాకరణోద్యమం సందర్భంగా గుంటూరులో 30,000 మంది స్వఛ్ఛందకులతో ఒక ప్రదర్శనను నిర్వహించారు. 1926లో కేంద్ర శాసనసభకు కాంగ్రెసు పార్టీ అభ్యర్ధిగా ఎన్నికయ్యారు.

1937లో కాంగ్రెసు అధికారంలోకి వచ్చినపుడు, రాజాజీ మంత్రివర్గంలో ఆయన రెవిన్యూమంత్రి అయ్యారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. 1946లో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై, 13 నెలలపాటు ఆ పదవిలో కొనసాగారు. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాడు. స్వంతపార్టీలోని అంతర్గత రాజకీయాలకు ఆయన ప్రభుత్వం బలికావడం వల్ల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి.. సొంతంగా ప్రజాపార్టీని స్థాపించారు. 1952లో తన పార్టీ ద్వారా అధికారంలో వున్న కాంగ్రెస్ మంత్రులందరూ ఓడిపోయేలా చేశారు. కానీ ఆయన సొంత పార్టీకి అధకారానికి వచ్చే మద్దతు చేకూరకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

1953 అక్టోబర్‌ 1న ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం నియమితులయ్యారు. అయితే ఆయన పాలనాకాలంలో ప్రముఖ సంఘటనలెన్నో జరిగాయి. రాష్ట్రావతరణ మొదటి వార్షికోత్సవంతో 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష, తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, విజయవాడ వద్ద కృష్ణా నది పై బారేజి నిర్మాణం వీటిలో ప్రముఖమైనవి. కమ్యూనిష్టులు ఈయన పాలనను వ్యతిరేకించటం, సోషలిస్టులు మద్దతు ఉపసంహరించటం వల్ల.. ఆయన ప్రభుత్వం 14 నెలలకే అవిశ్వాస తీర్మానంతో కూలిపోయింది. అనంతరం ఆయన క్రియాశీల రాజకీయాలనుండి విరమించుకున్నారు.

రాజకీయాలనుండి ఈయన వైదొలిగినా... చురుకుగా రాష్ట్రమంతటా పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగానే ఒంగోలు రాష్ట్రంలో వడదెబ్బకు గురై, నీరసించి హైదరాబాదులో ఆసుపత్రిలో చేర్పించబడ్డారు. చికిత్స పొందుతూ అక్కడే 1957, మే 20న పరమపదించాడు. జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles