Sv ranga rao biography indian film actor director producer telugu tamil film industries

sv ranga rao biography, sv ranga rao news, sv ranga rao birthday, sv ranga rao death day, sv ranga rao wikipedia, sv ranga rao wiki telugu, sv ranga rao telugu, sv ranga rao photos, sv ranga rao life story, sv ranga rao history, sv ranga rao movies, sv ranga rao filmography, sv ranga rao story, sv ranga rao life story, sv ranga rao actor, telugu movie actors, telugu heroes, telugu great actors, tollywood actors, telugu tamil movie actors, tollywood news

SV Ranga Rao biography Indian film actor director producer telugu tamil film industries

నట యశస్విగా పేరొందిన ఎస్వీ రంగారావు

Posted: 12/06/2014 03:41 PM IST
Sv ranga rao biography indian film actor director producer telugu tamil film industries

సుప్రసిద్ధ కథానాయకులుగా పేరొందిన నటులలో ‘‘ఎస్వీ రంగారావు’’ ఒకరు! మూడు దశాబ్దాలపాటు 300 చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి, ‘‘నట యశస్వి’’గా పేరొందారు. ముఖ్యంగా ఆయన ఆధ్యాత్మిక సంబంధించి చిత్రాల్లోనే ఎక్కువగా నటించారు. ఆనాడు ఆయన నటించిన ఘటోత్కచుడు, కీచకుడు, రావణాసురుడు వంటి పాత్రలు ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. మొత్తం సినిమాల్లో ఆయన నటించిన పాత్రల్లో ఎంతవరకు మమేకమయ్యేవారంటే.. వేరెవరు కూడా ఆ పాత్రల్లో ఇప్పటివరకు ఇమడలేకపోయారు. ఈయనకు కేవలం నట యశ్వసియే కాదు.. నటసామ్రాట్ , విశ్వనట చక్రవర్తి అనే బిరుదులు కూడా వున్నాయి.

జీవిత విశేషాలు :

1918 జూలై 3వ తేదీన కృష్ణా జిల్లాలోని నూజివీడులో లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడు దంపతులకు ఎస్వీ రంగారావు జన్మించారు. ప్రాథమిక పాఠశాల విద్యానంతరం హిందూ కాలేజీలో డిగ్రీ వరకు చదివారు. తర్వాత అగ్నిమాపక దళంలో ఉన్నత ఉద్యోగిగా పనిచేశారు. ఆ ఉద్యోగ సమయంలోనే ఆయన షేక్స్’పియర్ ఆంగ్ల నాటకాల్లో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి.. ప్రముఖ రంగస్థల కళాకారుడిగా పేరుగాంచారు. ఆ తర్వాత ఆయన దర్శకుడు బి.వి.రామానందం నిర్మించిన ‘‘వరూధిని’’ చిత్రంలో ప్రవరాఖ్యుడిగా చిత్రపరిశ్రమ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.

సినీ జీవితం :

‘‘వరూధిని’’ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రంగారావు.. తర్వాత ‘‘మనదేశం, పల్లెటూరి పిల్ల , షావుకారు, పాతాళభైరవి, పెళ్ళి చేసి చూడు, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాతా మనవడు’’ వంటి అనేక చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి, తన నటనాచాతుర్యంతో ప్రేక్షకులను మెప్పించారు. ఆయన నటించిన పాత్రలు ఎంతో వైవిధ్యమైనవి కాబట్టి.. ఆయనలా ఎవరూ నటించలేకపోయేవారు. దాంతో ఆయనకు ‘‘నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి’’ మొదలైన బిరుదులతో ప్రేక్షకులు గౌరవించారు.

రంగరావు నటించిన నర్తనశాల చిత్రం ఇండోనేషియాలోని జకార్తా ఫ్రో-ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడటమే కాకుండా కీచకపాత్రకు భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందారు. ఈయన కేవలం నటనలోనే కాదు.. దర్శకత్వ రంగంలోనూ తన ప్రతిభను నిరూపించుకోగలిగారు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన ‘‘చదరంగం’’ చిత్రం అద్భుత విజయం సాధించడంతోబాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బహుమతి, నగదు పారితోషికం లభించాయి.

వ్యక్తిగత జీవితం :

వ్యక్తిగా రంగారావు సహృదయుడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వర రావు. ఆయన ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవాడు. ఆయన ఒక రకమైన వేదాంతి కూడా! ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. అంతేకాదు.. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చిన గొప్పదాత.

చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చారు. అలాగే పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శలు చేసి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి అందించారాయన! ఇలా ప్రజాసేవకు తనదైన సహాయాన్ని అందించి, అద్భుత నటనకు ప్రతీకగా నిల్చిన ఎస్వీ రంగారావు 1974 జూలై 18వ తేదీన మద్రాసులో శాశ్వతంగా కన్నుమూశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sv ranga rao biography  telugu great actors  tollywood news  telugu news  

Other Articles