Comedy actor navvula nayakudu rajendra prasad birthday special

navvula nayakudu rajendra prasad birthday special, rajendra prasad birthday special, comedy actor rajendra prasad birthday special, comedy actor natakiriti rajendra prasad, natakiriti rajendra prasad, happy birthday nata kireeti, rajendra prasad, gadde rajendra prasad, comedy king dr rajendra prasad birthday today, breaking news, ap politics, political news, andhra news

Comedy Actor Navvula nayakudu rajendra prasad birthday special, Navvula nayakudu rajendra prasad birthday special

నవ్వుల నాయకుడు రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు

Posted: 07/19/2013 12:52 PM IST
Comedy actor navvula nayakudu rajendra prasad birthday special

నవ్వుల నాయకుడు రాజేంద్రప్రసాద్, రాజబాబు నక్షత్రంలో రేలంగి రెండో పోదంలో హాస్యపు ఘడియల్లో పుట్టాడు . ఈ రోజు ఈ నవ్వుల నాయకుడు రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు. రాజేంద్రప్రసాద్ అసలు పేరు గద్దె రాజేంద్ర ప్రసాద్. 1956 జూలై 19. కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసి తన గమ్యం వెతుక్కుంటూ ఎన్నో కష్టాలను ఎదుర్కోని... చిన్న చిన్న వేషాలతో సర్దుకు పోతూన్న రాజేంద్ర ప్రసాద్‌ తొలి చిత్రం 1977లోని స్నేహం. 1982లో వొచ్చిన మంచుపల్లకి చిత్రంతో బ్రేక్‌ వొచ్చింది. ఈ చిత్రానికి వంశీ డైరెక్టర్‌. హాస్య బ్రహ్మ జంధ్యాలతో కలిసి రాజేంద్ర ప్రసాద్ చేసిన ‘రెండురెళ్ల ఆరు', ‘అహనా పెళ్లంట' మంచి పేరు తెచ్చి పెట్టాయి. హీరో అంటే పైట్స్, పాలు అనే మార్కును తొలగించి... హాస్యాన్నే ప్రధానంశంగా తీసుకుని సినిమాలు చేసి, విజయం సాధించిన నటుడు రాజేంద్రప్రసాద్. కేవలం హాస్యాన్నే గాక.. నవరసాల్ని పండించి, కథానాయకుడిగా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. నటుడిగా వివిధ భాషల్లో రెండు వందల పైచిలుకు చిత్రాల్లో నటించాడీ ఆంధ్రా చార్లీచాప్లిన్. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు స్ఫూర్తితో... సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన రాజేంద్ర ప్రసాద్ ప్రేమించు పెళ్లాడు సినిమాతో హీరోగా మారాడు.

 

రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు. ఆయన పండించే హాస్యం తెలుగు సినిమా ను ప్రపంచస్థాయికి తీసుకెల్లింది. ఆయన నటించిన సినిమాలలో అహ నా పెల్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్ర్ఫిల్ 1 విడుదల, మాయలోడు మంచిపేరు తెఛ్ఛిపెట్టాయి. నవ్వుల నట కిరీటి గురించి కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న రోజుల్లో...హీరో కూడా నవ్వుల్ని వండివార్చగలడు అని నిరూపించాడు రాజేంద్రప్రసాద్. జంధ్యాల, రేలంగి నరసింహారావు,ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి వారి దర్శకత్వంలో అద్భుతాలు నమోదు చేసిన ఘనత రాజేంద్రప్రసాదుది. కేవలం నవ్వించడమే కాదు ఏడిపించడంలోనూ మన నటరాజు సిద్ధహస్తుడే. కేవలం టాలీవుడ్ కే పరిమితం కాకుండా... నటకిరీటి కీర్తి క్విక్ గన్ మురుగన్ సినిమాతో హాలీవుడ్ దాకా పాకింది.

రెండు నంది అవార్డుల సహా ఒక ఫిలింఫేర్ పురస్కారం రాజేంద్రప్రసాద్ ఖాతాలో ఉంది. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటాడు. రాజేంద్ర ప్రసాద్ నటుడే కాదు నటి కూడా. మేడమ్ సినిమా ఇందుకు చక్కని ఉదాహరణ. రాజేంద్ర ప్రసాద్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిల్యూట్స్‌లో ఎన్నొ గోల్డ్‌ మెడల్స్‌ అందుకున్నారు. ప్రేమ తపస్సు చిత్రంలో అతని నట విశ్వరూపమే చూడొచ్చు. ఎర్రమందారం, ఆ నలుగురు సినిమాకి ఉత్తమ నటుడగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు సార్లు నంది అవార్డు అందుకున్నారు. శాఖాహారం మాత్రమే తీసుకోవాలనే ఓ మంచి ఉద్దేశ్యంతో... క్విక్‌గన్‌మురుగన్‌ అనే ఆంగ్ల చిత్రం ద్వారా అంతర్జాతీయంగా కీర్తిని సంపాదించిన ఈ నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడూ ఇలా తన నటనతో ప్రేక్షకులను అలరించాలని కోరుతూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతుంది తెలుగువిశేష్.కామ్.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles