Tollywood music director k v mahadevan special

music director k.v. mahadevan, tollywood music director k. v. mahadevan, tamil music director k.v. mahadevan, k. v. mahadevan songs, k.v. mahadevan audio songs, mahadevan telugu song,

tollywood music director k. v. mahadevan special

'మామ' ప్రవేశ పెట్టిన ఒరవడి

Posted: 05/08/2013 03:28 PM IST
Tollywood music director k v mahadevan special

శిలలపై శిల్పాలు చెక్కినారు (మంచి మనసులు), మావ మావ మావ. (మంచి మనసులు), చదువురానివాడవని దిగులు చెందకు (ఆత్మబంధువు), ముద్ద బంతి పూవులో మూగకళ్ళ ఊసులు (మూగమనసులు); మెల్లమెల్ల మెల్లగ (దాగుడుమూతలు) చిటపటచినుకులు పడుతూఉంటే (ఆత్మబలం); అదిగో నవలోకం (వీరాభిమన్యు), వెన్ ఐ వాజ్ యంగ్ - అత్త వడి పువ్వువలె మెత్తననమ్మ (నమ్మినబంటు), దివి నుండి భువికి దిగివచ్చె దిగివచ్చె (కన్నె మనసులు), కొత్త పెళ్ళికూతురా రా రా (సుమంగళి), నీవు నా ఊహలందే నిలిచావు (ఇల్లాలు), నిను వీడని నీడను నేనే (అంతస్థులు), ఈ ఉదయం నా హృదయం (కన్నె మనసులు), సోగ్గాడే చిన్ని నాయనా (ఆత్మబలం), వినరా సోదర భారత యోధుల విజయ గాధ నేడు; ఎవరికి వారె ఈ లోకం రారు ఎవ్వరు నీ కోసం (సాక్షి), ఇలా ఈ సంగీత దర్శకులు కట్టిన దాదాపు ప్రతీ బాణీ మనకు సుపరిచితం ...

తెలుగు సినిమా సంగీతం కొత్త పుంతలు తొక్కుతున్నా కూడా , ఈ నాటికీ ఈ సంగీత దర్శకుడి ఎన్నో పాటలు మనం ఆలాపన చేస్తుంటాం , కనీసం అప్పుడప్పుడూ కూని రాగాలైనా తీస్తుంటాం ... అంతగా మారుతున్న కాలం తో సంబంధం లేకుండా , మనల్ని కట్టి పడేసిన ఈ భానీలు , 'మామ' కాక ఇంకెవరు సమకూర్చగాలిగేవారు చెప్పండి ??? యావత్ దక్షిణాధి సినీ పరిశ్రమ అంతా కూడా ముద్దుగా పిలుచుకునే 'మామ' సంగీత దర్శకులు కే . వీ . మహదేవన్ ...

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా , ప్రతీ తెలుగు చిత్రానికి ఈయనే సంగీతం అందించారు , ఏ బాణీ కూడా , కాపీ కొట్టబడింది కాక , ప్రతీ బాణీ మనకు కొత్తగా ఉన్న అనుభూతి కలిగించిందే అంటే అది కేవలం 'మామ' కు మాత్రమే సాధ్యం ...

పింగళి , పెండ్యాల , ఘంటసాల వారి స్వరాల శైలికి అలవాటు పడ్డ తెలుగు సినీ ప్రేక్షకులకు , కమర్షియల్ సినిమాలు ఎలా అయితే నూతనత్వాన్ని సమకూర్చాయో అలాగే 'మామ' బాణీలు కూడా , ఒక సరికొత్త లోకం లో విహరించేలా చేసాయి ... 'మనసే కోవెలగా ' అనే వినసొంపైన గీతం విన్నా , 'మామ మామ ... ' అనే హుషారెత్తించె పాట విన్నా , విరహ గీతం , ఆలోచింప చేసే పాట , మనలో నూతన ఆత్మా స్థైర్యాన్ని నింపే గీతం , ఇలా ఒకటేమిటి , నవరసాలనీ తన బానీల ద్వారా ఆవిష్కరించిన సంగీత దర్శకులు మహదేవన్ ... అందుకేనేమో ఇక ఏ సంగీత దర్శకుడు కూడా తెలుగు సినిమా సంగీతం చెయ్యాలి అని కనీసం ఆలోచించలేని విదంగా , నిర్విరామం గా కొన్ని సంవత్సరాల పాటు మహదేవన్ తెలుగు సినీ సంగీత లోకానికి రారాజయ్యారు ... నేటికీ విరాజిల్లుతున్నారు ... భౌతికంగా , అలనాటి మేటి నటులు , సంగీత దర్శకులు , హాస్య నటులు , రచయితలు , ఇలా ఎంతోమంది మన మధ్య లేకపోయినా ఎలా అయితే మనం వీరిని ఎప్పటికీ మరచిపోలేమో , మహదేవన్ సంగీతం కూడా ఇలా చిరస్మరణీయమే ...


ఇతర ఏ సంగీత దర్శకుడు చెయ్యని విధంగా సాహసం చేసి , తాను కష్టపడ్డా మహదేవన్ సంగీతం లో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు ... అదే ముందు పాత రచయితకు పూర్తి స్వేచ్చనిచ్చి, పాటకు మాట సమకూరిన తరువాతే , తదనుగుణంగా బాణీలు సమకూర్చడం ...

దర్శకుడు , రచయితా వారి తిప్పలు వారు పడతారు, మనం బాణీలు ఇస్తే చాలు కదా అని అనుకోకుండా , సందర్భానికి , మాటకీ అతికినట్టు పాట ఉండాలి అన్న ఉద్దేశం తో మామ ప్రవేశ పెట్టిన ఈ ఒరవడి , నేటికీ ఎందరో టాప్ సంగీత దర్శకులు ఆచరిస్తున్నారు అంటే , మామ గొప్పతనం ఎంతటిదో మరొక్కసారి రుజువవుతోంది ...

కేరళ లో పుట్టి , తమిళ నాట పెరిగి , ఈ రెండు భాషల సినిమా ల కన్నా ఎక్కువగా , తెలుగు సినీ సంగీతానికి రారాజు గ ఎదిగిన మహదేవన్ , సంగీతాన్ని - సాహిత్యాన్ని కూడా సమానంగా గౌరవించాలి అనే సిద్ధాంతాన్ని నమ్మే ఎంతో మంది సినీ దిగ్గజాలకు , సంగీత దర్శకులకు ఆదర్శం ... 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles