Raja babu comedian

raja babu comedian,comedy dialogues raja babu,raja babu comedy bits, raja babu comedy telugu,telugu comedy clips raja babu,Telugu,Film,Industry

Popular Telugu Film Comedian Raja Babu.

కమేడియన్ రాజాబాబు

Posted: 05/07/2013 04:01 PM IST
Raja babu comedian

మన తెలుగు సినీ పరిశ్రమ లో మూకీ నుండి టాకీ వరకు, నేడు రోజుకో కొత్త పుంతలు తొక్కుతున్న కమర్షియల్ చిత్రాల జోరు వరకు కధా, కధనం, ఎలా ఉన్నా , కుటుంబ కధా చిత్రం అయినా , సెంటిమెంట్ తో గుండె పిండే చిత్రం అయిన, ప్రేమ కధ అయినా , యాక్షన్ చిత్రం అయినా , నటనకు , సినిమా కు మూలం గా భావించే ఒక్క రశం మాత్రం ఖచ్చితంగా ప్రతీ చిత్రం లో ఉండి తీరుతుంది ... అదే హాస్య రశం... అందుకే హీరోయిన్ల కరువు వచ్చిందని , రేపో మాపో మంచి కధ, ఏమో హీరోలకు కరువు కూడా రావచ్చు అని మొత్తుకునే నిర్మాతలు 'హాస్య నటుల కు మాత్రం కొదవ లేదు అని ఊపిరి పీల్చుకుంటున్నారు ... అటు హాస్య బ్రమ్హ బ్రమ్హి దగ్గరి నుండి ఇటు ఈ మధ్యనే గుర్తింపు తెచ్చుకుంటున్న శ్రీనివాస్ రెడ్డి , తాగుబోతు రమేష్ వంటి వారి వరకు , దాదాపు ప్రతీ మూడవ చిత్రానికీ ఒక హాస్య నటుడు పుట్టుకొస్తూనే ఉన్నాడు ... గీతా సింగ్ వంటి హాస్య నటీమణు లని హీరోయిన్లు గా పెట్టి సినిమాలు తీసిన సందర్భాలూ లేకపోలేదు ...

అయితే నేటికీ ప్రతీ తెలుగు హాస్య నటుడు ఆదర్శంగా భావించే అలనాటి మేటి సాటిలేని హాస్య నటులలో ముందు వరుసలో ఉండే పేరు , నిస్సందేహంగా రాజబాబు గారే అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు ... అసలు ముఖ కవళికలు , వాయిస్ ని పెక్యులియర్ గా మార్చి పాత్రకి అనుగుణంగా గొంతుని మలచడం , హావ భావాలలో ఎంతో వైవిద్యం , ఇన్ని వేరియేషన్స్ హాస్య రశంలో ఉంటాయి అని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన నటులు రాజబాబు ...

అటు హాస్య నటుడిగా తిరుగులేని గుర్తింపును సంపాదించుకోవడమే కాదు , హీరోల కన్నా ఎక్కువ డిమాండ్ ని క్రియేట్ చేసుకుని , తాను లేని సినిమా లేదు అని ఒకానొక దశలో దశాబ్దం కన్నా ఎక్కువ కాలం పాటు అనిపించుకున్న నటుడు రాజబాబు ...

రాజబాబు కేవలం హాస్య రసాన్ని పండించడం లో మాత్రమె దిట్ట అనుకుంటే పొరబాటే ... 'తాతా - మనవడు' వంటి కుటుంబ కధా చిత్రాలలో కధానాయకుడిగా రాజబాబు పండించిన ఎమోషన్స్ అద్వితీయం , అనిర్వచనం ... రాజబాబు స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నప్పుడు , ఈయన నటన యొక్క స్టైల్ ని అనుకరించాలని ప్రయత్నించిన నటులు లేకపోలేదు ... ఇలా అటు ప్రేక్షక లోకాన్నే కాదు , ఇటు తోటి నటులని కూడా ఇన్స్పైయర్ చేసిన హీరో కమెడియన్ రాజబాబు ...

ఈ రోజు వరకు హీరోల దగ్గరి నుండి క్యారెక్టర్ నటుల వరకు నటనలో అత్యంత విజయం సాధించిన అందరూ, కనీసం ఎక్కువ శాతం రంగస్థలం నుండి వచ్చిన వారే ... రాజబాబు కూడా ఈ కోవకే చెందిన వారు... రంగస్థల నటుడిగా రాజబాబు కొనసాగుతున్నప్పుడు, అప్పటి ప్రముఖ దర్శకులు గరికపాటి రాజారావుగారు ప్రోత్సహించటంతో 1960వ సంవత్సరంలో మద్రాసు వెళ్ళారు రాజబాబు. సినీ నటనలో కొద్దిపాటి మెళకువలు తెలుసుకున్న అనంతరం అడ్డాల నారాయణరావుగారు రూపొందించిన 'సమాజం' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తొలి రోజుల్లో నిలదొక్కుకోవడానికి కాస్త కష్టపడ్డ తరువాత ఇక వెనుక తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు రాజబాబు గారికి ...

ఎన్నో వందల చిత్రాలలో నటించిన రాజబాబు కి నటుడిగా పేరు - గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాలు  ఆకాశరామన్న, సతీ శబరి, ప్రచండ భైరవి, సత్యహరిశ్చంద్ర, సంగీత లక్ష్మి, పరమానందయ్య శిష్యుల కథ, ఉమ్మడి కుటుంబం, విచిత్ర కుటుంబం తదితర చిత్రాలు ...

ఇప్పుడు బ్రమ్హానందం - కోవై సరళ లాగే , అప్పుడు కూడా హాస్య కొడీలు కలిసిమరీ ప్రేక్షకులని నవ్వించేవి ... అలాగే అమితంగా  ప్రేక్షకాదరణ పొందిన జంట రాజబాబు రమాప్రభ గారిది ...

అటు నటుడిగా హాస్యాన్ని పంచడమే కాదు , ఇటు ఉన్నత విలువల తో జీవించిన వ్యక్తిగా కూడా రాజబాబు ఎందరికో ఆదర్శం ... 1960 లో నటుడి గా అడుగుపెట్టిన తరువాత ఆనతి కాలం లోనే గుర్తింపు తెచ్చుకున్న దగ్గరి నుండి , 1983 తన తుది శ్వాస విడిచేంత వరకు కూడా , రాజబాబు ప్రతీ సంవత్సరం తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఎందరో నటులకు సన్మానం చేసి గౌరవం గా సత్కరించేవారు ... సావిత్రి వంటి ఎందరో మహా నటుల కృషిని రాజబాబు వీరిని సత్కరించడం ద్వారా చాటారు ... ఇంతే కాదు , ఎన్నో స్వచ్చంద సంస్థలకు పెద్ద మొత్తం లో విరాళాలు ఇచ్చి , ఎందరి జీవనానికో అండగా నిలిచిన ఘనతా రాజబాబు గారిదే ...

అందుకేనేమో , ఇటు నటనలోనే కాక అటు వ్యక్తిగా కూడా రాజబాబు గారు మరువలేని మనిషి ... ఇంతకీ రాజబాబు గారి అసలు పేరేమిటో తెలుసా ??? పుణ్యమూర్తుల అప్పలరాజు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles