Mogalirekulu fame rk naidu interview

Mogali Rekulu, Gemini TV, Daily Serials, Mogali Rekulu episode, Sun network, Telugu popular, Dharma, keerthana, RK, Satya Daya, Aishwarya, Munna real na

Mogalirekulu fame RK Naidu on his role in mogali rekulu serial, Gemini mogali rekulu serial.

Mogalirekulu fame RK Naidu interview.GIF

Posted: 04/09/2012 06:27 PM IST
Mogalirekulu fame rk naidu interview

Mogalirekulu_fame_RK_Naidu

Mogalirekuli_fame_Sagarరాత్రి ఎనిమిదిన్నరంటే ఇంట్లోని ఆడవాళ్ళు, కాలేజీ అమ్మాయిలు, పిల్లలు అతని కోసం ఎదురు చూస్తారు. మరి ఆయన కోసం మహిళలు అంతగా ఎదురు చూడటానికి కారణం. ఆయన మన బంధువా ? అంటే కాదు... కేవలం రోజు మనింటికి వచ్చే అతిథి లాంటి వాడు. ఆయనే

ఆర్కే....ఎవరీ ఆర్కే?

సినిమా హీరోలకు వెండి తెర పై ఎంత గ్రేజ్ ఉందో బుల్లి తెర పై అంతే క్రేజ్ ‘ఆర్కే’కి ఎలా వచ్చింది? ఒక సీరియల్ హీరో... సినిమా హీరోలని మించి ఎలా ఫ్యాన్స్‌ ని సంపాదించుకోగలిగాడు? ‘మొగలిరేకులు’ విచ్చుకుంటే మనకు ఆర్కే, మున్నా మాత్రమే కనిపిస్తారు. ఓసారి అతడి అంతరంగాన్ని తెరచి చూస్తే సాగర్ కనిపిస్తాడు. సంచలన నటుడిగా ఇటీవలే ఉగాది పురస్కారం  పొందిన అతను చెప్పిన విషయాలు...అనుకున్నది అనుకున్నట్టు జరిగితే జీవితమెందుకవుతుంది! చాలామంది అంటుంటారీ మాట. నేనూ అదే అంటాను. ఎందుకంటే ఆ మాట ఎంత నిజమో చెప్పడానికి ఉదాహరణ... నా జీవితమే!

అది ఎక్కడో మొదలయ్యింది. ఎన్నెన్నో మలుపులు తిరిగింది. చివరికి ఇక్కడికొచ్చి ఆగింది.నేను పుట్టింది కరీంనగర్ జిల్లా, గోదావరిఖనిలో. అమ్మ, నాన్న, నేను... చిన్న కుటుంబం. పదో తరగతి వరకూ స్థానిక చిన్మయ విద్యాలయలో చదువుకున్నాను. నిజానికి చదువుకున్నాను అనడం కంటే, జీవితం గురించి నేర్చుకున్నాను అంటే బాగుంటుంది. ఎందు కంటే అక్కడి టీచర్లు మమ్మల్ని భవిష్యత్తులో ఇంజినీరులాగానో, డాక్టర్లుగానో చూడాలని కోరుకునేవారు కాదు. మమ్మల్ని మంచి పౌరులుగా ఎలా తీర్చిదిద్దాలా అనే ఆలోచించేవారు. దానికి ఓ ఉదాహరణ చెబుతాను. అలాంటి బళ్లో చదివినందుకు చాలా గర్వంగా ఉంటుంది.

ఇంట్లోవాళ్లు డబ్బులు పంపుతుంటే ఆడుతూ పాడుతూ చదువుకునే పరిస్థితి కాదు నాది. కష్టపడుతూనే కళ్లు మూసుకుని మూడేళ్లు గడిపేశాను. ఆ తర్వాత ఏం చేయాలి... మళ్లీ కన్ఫ్యూజన్! అప్పుడే నా జీవితం నేనెన్నడూ ఊహించని ఓ విచిత్రమైన మలుపు తిరిగింది. దానికి కారకుడు... కొరియోగ్రాఫర్ శ్రావణ్. శ్రావణ్ నాకు ఆప్తుడు. ఏ లక్ష్యం లేక, దేన్ని లక్ష్యంగా మలచుకోవాలో తెలీక డైలమాలో ఉన్న సమయంలో... అతనితో పాటు సరదాగా మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్తుండేవాడిని. అది నాకో కొత్త ప్రపంచం. నటన నేర్చుకుంటున్నవాళ్లని చూసి- ఇదేదో బాగుందే, మనమెందుకు చేయకూడదు అనిపించేది. చివరికి నేనూ చేయగల నేమో చూద్దాం అని మొదలుపెట్టినవాడ్ని... నటుడిని అయి తీరాలని స్ట్రాంగ్‌గా డిసైడైపోయాను.

అదృష్టం తలుపు తట్టింది!

2006, నవంబర్ 15. మంజులా నాయుడు నుంచి ఊహించని ఫోన్ కాల్. ‘చక్రవాకం’లో ఓ పాత్ర ఉంది చేస్తావా అని అడిగారు. చేయనని అంటానా? తర్వాత రోజు వెళ్తే బిందు మేడమ్ ‘జగన్’ పాత్ర గురించి చెప్పారు. ‘ప్రస్తుతానికి చిన్న పాత్రే అనుకుంటున్నాం. ఎంత నిడివి ఉంటుందో చెప్పలేం. నీకిష్టమైతే చెయ్యి’ అన్నారు. నిజానికి అంతకు ముందే ‘చక్రవాకం’లో వినోద్ అనే రోల్ ఇచ్చారు. నేనది సరిగ్గా చేయలేకపోయాను. అయినా మళ్లీ అవకాశం ఇచ్చారంటే అది నిజంగా నా అదృష్టమే. అందుకే సంతోషంగా స్వీకరించాను. మొదట్లో డైలాగ్ సరిగ్గా చెప్పలేకపోయే వాడిని. హావభావాలు స్పష్టంగా చూపలేక పోయేవాడిని. కో డెరైక్టర్ జనార్దన్ సాయంతో మెల్లగా ఇంప్రూవ్ చేసు కున్నాను. ఒక్కసారే ఏదీ పూర్తిగా రాదుగా! శ్రమ పెరిగేకొద్దీ ఫలితమూ పెరుగుతుంది. జగన్ పాత్ర రాను రాను పెరిగి పోయింది. నాకు మంచి పేరుని, నటుడిగా రాణించగలనన్న నమ్మకాన్నీ కలిగించింది. అందుకే తర్వాత ఉద్యోగం వచ్చినా వదిలేసుకున్నాను. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కావడానికి నేను కష్టపడింది కేవలం ఆరు నెలలు. కానీ నటుడిని కావడానికి కష్టపడింది ఆరేళ్లు!

ఆర్కేలా మారిపోయాను!

చక్రవాకం అయిపోతుందనగా మరో కొత్త సీరియల్ మొదలుపెడుతున్నారని తెలిసింది. ఆ సీరియల్ ఓపెనింగ్ రోజున చూశాను ‘మొగలి రేకులు’ అన్న పేరు. భలే ఉందే అనుకున్నాను తప్ప అందులో నాకూ భాగముంటుందనుకోలేదు. నిజానికి చక్రవాకం తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి కానీ ఒప్పుకోలేదు. మళ్లీ ఆ స్థాయికి తగ్గ పాత్ర వస్తేనే చేయాలనుకున్నాను. దాంతో నెలన్నర గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మంజుల గారి నుంచి మళ్లీ పిలుపు. ‘మొగలి రేకుల్లో ఓ పోలీస్ క్యారెక్టర్ అనుకుంటున్నాం, చేస్తావా’ అనడిగారు. నిజానికి బిందుగారు నన్ను దృష్టిలో పెట్టుకునే ఆ పాత్రను సృష్టించారు. నేను సరే అన్నాను. ‘మళ్లీ పిలుస్తా. ఈ లోపు పోలీసు పాత్ర ఎలా ఉండాలో తెలుసుకో’ అన్నారు. అంతే... నేను ఆ క్షణంలోనే పోలీస్‌గా ఫిక్సైపోయాను. ఆర్కే పాత్రలో నేను ప్రవేశించాలనుకుంటే, ఆర్కేనే నాలో ప్రవేశించాడు. నేను సాగర్‌గా ఉన్నది తక్కువ. ఆర్కేగా యూనిఫామ్‌లో ఉన్నది ఎక్కువ. ఒక్కమాటలో చెప్పాలంటే, నేను సాగర్‌నన్న విషయం పూర్తిగా మర్చిపోయాను. ఆర్కేగా మిగిలిపోయాను.

ఈ రోజు నేనీ స్థాయిలో ఉండేవాడిని కాదేమో! Mogalirekuli_fame_Sagar1

సినిమా, సీరియల్ ఏం చేసినా ప్రేక్షకుల అభిమానమే నటుడికి బలం. నేను చేస్తున్న పాత్రలు ప్రేక్షకులపై ఇంత ప్రభావం చూపుతున్నాయా అని ఒక్కోసారి ఆశ్చర్యపోతుంటాను. ఎందుకంటే నేనెక్క డైనా కనిపిస్తే ఎవరెవరో పెద్దవాళ్లు సైతం ఆర్కే సార్ అని మర్యాదగా పిలుస్తుం టారు. మా ఇంటి దగ్గర్లో ఉన్న ఆర్.సి.రెడ్డి ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు కొంతమంది ‘ఆర్కే ఇన్‌స్పిరేషన్‌తోనే ఐపీఎస్‌కి ప్రిపేరవు తున్నాం’ అని చెబుతుంటారు. ఓ నటుడికి ఇంతకంటే గొప్ప విజయం, సంతృప్తి ఉండవనుకుంటా!

నేను చాలా సింపుల్‌గా

ఉండే వ్యక్తిని. నా ఇష్టాయిష్టాలు కూడా అలాగే ఉంటాయి. తెలుపు, నలుపు రంగులు ఇష్టపడతాను. జీన్స్, టీ షర్టులు వేసుకుంటాను. అమ్మ చేసే పాయా ఇష్టంగా తింటాను. గీతాంజలి సినిమాను, చిరంజీవి-రమ్యకృష్ణల నటనను ఎంజాయ్ చేస్తాను. తీరిక వేళల్లో నా ఫ్లాట్‌లో ఒంటరిగా ఎంతసేపైనా గడిపేస్తాను.

అలాంటి అమ్మాయే కావాలి!

చాలామంది నాకు పెళ్లయ్యిందని, పిల్లలు కూడా ఉన్నారని అనుకోవడం చూశాను. కొందరైతే లిఖిత (దేవి)ని చేసుకున్నానని, షీలాసింగ్ (శాంతి) తో పెళ్లయ్యిందనీ అన్నారు. అవేమీ నిజం కాదు. ఇంతవరకూ నాకు పెళ్లి కాలేదు. నాకు తగ్గ అమ్మాయి కోసం చూస్తున్నాను. నేను చేసుకోబోయే అమ్మాయి సింపుల్‌గా ఉండాలి., ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం ఉండాలి. నాకు అమ్మానాన్నలంటే ప్రాణం. నాతో పాటు వాళ్లను కూడా బాగా చూసుకోవాలి. అలాంటమ్మాయి దొరికితే వెంటనే చేసేసుకుంటాను!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Interview with new director maruthi dasari
Happy days hero varun sandesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles