Interview with new director maruthi dasari

maruthi dasari, ee rojullo director maruthi dasari, canon 5d, prasanna kumar, rgv dongala mutha

Maruthi appears calm, happy. He is just back from Tirupati after a thanksgiving and has signed a film with Nitin. What a rise - the man from Machilipatnam began his career as a number plate and sign board artist, completed his studies with his hard earned money and came to Hyderabad to work in an animation company. He never worked as an assistant director but always was inclined to direct a film.

Interview With New Director Maruthi Dasari.gif

Posted: 04/13/2012 03:10 PM IST
Interview with new director maruthi dasari

Interview_With_New_Director_Maruthi_Dasari

Director-Marutiఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటున్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఉన్నారు. కానీ తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి టేబుల్ ఫ్రాఫిట్ 22 లక్షలు తెచ్చి పెట్టిన ఓ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడంటే మీకు నమ్మశక్యంగా ఉందా ? కానీ నమ్మాలి. ఓ కొత్త డైరెక్టరుగా, అందరు కొత్త వాళ్లతో, 5డి కెమెరాతో సినిమా తీసి అందరి చేత ‘‘ఈ రోజుల్లో’’ ప్రశంసలు అందుకుంటున్న న్యూ డైరెక్టర్ మారుతి దాసరి. అతని సక్సెస్ వెనుక రహస్యం, అతని గురించి ఓసారి తెలుసుకుందాం.

దాసరి మారుతి మచిలీపట్నానికి చెందిన వాడు. తన బాల్యం, చదువు అంతా మచిలీపట్నంలోనే సాగింది. డిగ్రీ వరకు చదివిన మారుతి... చుదువుకునే రోజుల్లో  నెంబర్ ప్లేట్స్ మరియు సైన్ బోర్డ్స్ లాంటి వర్స్ చేస్తుండేవాడు, తన చదువు పూర్తయిన తరువాత ఆర్థికంగా ఎదగాలనే ఉద్ధేశ్యంతో మచిలీపట్నం నుండి హైదరాబాద్ కి వచ్చి ఓ యానిమేషన్ సంస్థలో కొన్నాళ్ళు జాబ్ చేశాడు. యానిమేషన్ డైరక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు బన్నితో పరిచయం కలిగింది. అప్పటి నుంచి సినిమాల పట్ల ఆసక్తి మొదలైంది. బన్నీవాసుతో కలిసి కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాడు. 'ఎ ఫిల్మ్ బై అరవింద్', 'ప్రేమిస్తే' చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా ప్రారంభించే సయంలో అతనికి ప్రజారాజ్యానికి చెందిన యాడ్ ఫిలిం తీసిన కొద్ది పాటి అనుభవం తప్పితే... అతను ఇండస్ట్రీలో ఎవరి దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయలేదు. అలాంటి మారుతి డైరెక్ట్ గా సినిమా తీసి సంచలనం కలిగించాడు. పెద్ద డైరెక్టర్లకు కనువిప్పు కలిగించాడు.

దాసరి మారుతి తీసిన ‘ఈ రోజుల్లో’ పెద్ద హిట్ గా నిలవడంతో ప్రముఖులు అతని పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అయితే ఏకంగా మారుతిని ఆకానికి ఎత్తేశాడు. రామ్ గోపాల్ వర్మ మారుతి గురించి పోస్ట్ చేస్తూ... నేను 5డి కెమెరాతో పెద్ద స్టార్స్ ని పెట్టి ‘దొంగల ముఠా’ తీశాను. అది పెద్దగా ఆడలేదు. కానీ నేను సాధించలేనిది, నీవు 5డి కెమెరాతో సినిమా తీసి, అది కొత్త వాళ్లతో తీసి సాధించావు’ అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు.

మరి పెద్ద బడ్జెట్ పెట్టి సినిమాలు తీసే డైరెక్టర్లు ఇకనైనా దాసరి మారుతి ని చూసి నేర్చుకుంటారో లేదో కానీ,  ఇతడు మాత్రం ఈ సినీ పరిస్థితిలో మార్పు రావాలి. పరిశ్రమ ఆరోగ్యకరంగా ఉండాలి. నేను భవిష్యత్తులో ఏ హీరోతో పనిచేసినా అతని మార్కెట్ ఎంతుంటే అంతకుపైసా తక్కువగానే ఖర్చుపెడతాను. కథలను నమ్ముకుంటాను'' అని అంటున్నాడు. భవిష్యత్తులోను తీసే సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉండాలనేదే నా లక్ష్యమని చెబుతున్న ఈయన కల నెరవేరాలని ఆకాంక్షిస్తూ మరిన్ని మంచి సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి అందియాలని కోరుకుందాం. ఇతని తదుపరి చిత్రం "బెల్లంకొండ సురేష్ సంస్థలో నితిన్ హీరోగా తీయబోతున్నాడు. ఇది కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఆంధ్ర విశేష్ ఆల్ ది బెస్ట్ చెబుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero srikanth latest interview
Mogalirekulu fame rk naidu interview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles