యాపిల్ ఐ-ఫోన్ ప్రపంచాన్నే తనలో నిక్షిప్తం చేసుకుంది. ఈ చిన్న పెట్టెలో ఉన్న అద్బుతాలు ఎన్నో. ఐ - ఫోన్ వాడేవారందరూ అందులోని ఫీచర్లు తెలుసు అనుకుంటారు. అయితే తెలియని చాలా ఫీచర్లు
ఉన్నాయి. అవి మీకోసం అందిస్తున్నాం.
* ఐ-ఫోన్ లో ఉన్న ‘అన్ డూ’ ఫీచర్ వల్ల టైప్ చేసేటపుడు తప్పులను సవరించుకునే, చెరిపేసిన వాటిని వెనక్కి తెచ్చుకునే అవకాశం ఉంది.
* ఐ-ఫోన్ లోని వ్యాల్యూమ్ కంట్రోలర్ల ద్వారా కూడా సులభంగా ఫొటోలు తీసుకొవచ్చు.
* క్యాప్చర్ బటన్ ను నొక్కి పెట్టి ఉంచి వరుసగా ఫొటోలు తీసుకోవచ్చు. వాటిలో నచ్చిన వాటిని దాచుకుని మిగతావి తొలగించవచ్చు.
* ఐ-ఫోన్ వాయిస్ బాక్స్ లోకి మనం ఉచ్చరించే పదాలు తేడాగా పలికితే వాటిని మనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది.
* సందేశాలు పంపిన, పొందిన సమయాలు తెలుసుకోవాలంటే.., మెసేజ్ ను ఎడమకు జరిపితే సరిపోతుంది.
* ఐ-ఫోన్ లో ఉన్న లొకేటర్ ద్వారా .., మనకు కావాల్సిన ప్రదేశంలో, అవసరమైన టైంకు రిమైండర్ మోగేలా ఫీడ్ చేయవచ్చు.
* మెసేజ్ లో డబుల్ స్పేస్ చేస్తే అక్కడితో ఆటోమేటిక్ గా వాఖ్యం పూర్తవుతుంది.
* ఫోన్ చార్జింగ్ తక్కువగా ఉంటే.. ఫ్లైట్ మోడ్ లో చార్జింగ్ పెడితె రెండు రెట్లు ఎక్కువ వేగంతో చార్జ్ అవుతుంది.
* కాల్ లేదా మెసేజ్ వచ్చినపుడు రింగ్ టోన్, వైబ్రేషన్ కు బదులుగా ఫ్లాష్ లైట్ ను కూడా అలర్ట్ గా ఉపయోగించవచ్చు.
* ‘సిరి’ద్వారా మనం ఉన్న ప్రదేశంలో ప్రస్తుతం ప్రయాణిస్తున్న విమానాల వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు.
* ఫోన్ లోని ఎండ్ కీ, స్క్రీన్ పై ఉండే కీని ఒకేసారి నొక్కి పెట్టడం ద్వారా స్క్రాన్ షాట్ తీసుకోవచ్చు.
ఇలా అనేక ఫీచర్లు ఐ-ఫోన్ లో ఉన్నాయి. వీటిని ఉపయోగిస్తే ఫోన్ లో ఇన్ని అద్బుతాలు ఉన్నాయా అనుకోక మానరు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more