10 lakh acres land bank in ap

AP Land Bank, 10 lakh acres land bank,

Naidu to occupy 10 Lakh acres of land and create land bank for AP

ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

Posted: 03/03/2015 09:25 AM IST
10 lakh acres land bank in ap

వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి.

చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి బ్యాంక్ తయారు చేస్తామని అంటున్నారు.అయితే ఎక్కడెక్కడి భూమి,ఎలా సేకరిస్తారు? పది లక్షల ఎకరాల భూమి సేకరణ సాధ్యమేనా? మళ్లీ రైతుల భూముల జోలికి రాకుండానే చేస్తారా?ఇలాంటి ప్రశ్నలకు ఎపి ప్రభుత్వం వివరణ ఇస్తే మంచిది.లేకుంటే అనవసర అనుమానాలు వ్యాపించే అవకాశం ఉంటుంది.
 
ఈ 10 లక్షల భూముల్లో TDP  సెంట్రల్ మినిస్టర్స్ ముందుగానే తక్కువ రేట్ కు కొని భూమి బ్యాంకు ని స్థాపిస్తార? ఇది అంత ప్రజల కోసమా లేక తమ స్వంత వారి కోసమా?
 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని వ్యవహారంలో, మర్యాదగా భూములు ఇస్తే పర్వాలేదు లేకపోతే.. స్వాధీనమేనని ఆయన స్పష్టత ఇచ్చాడు. 
 
ఇకపై పది లక్షల ఎకరాల భూమి బ్యాంక్వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. భూములను ఇవ్వడానికి నిరాకరిస్తున్న చట్ట ప్రయోగం ఉంటుందని బాబు స్వయంగా చెబుతున్నాడు కాబట్టి.. అలా స్వాధీనం చేసుకొనే ప్రక్రియ ఎలా ఉంటుంది? ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందా?! అనేది వేచి చూసి తెలుసుకోవాలి!
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Chandrababu  Landbank  

Other Articles