Ragging to new mlas in telangana assembly

telangana assembly sessions, telangana assembly latest news updates, telangana assembly discussion comments, kcr comments in telangana assembly, dlf telangana assembly, kcr on dlf, ragging in telangana assembly, new mlas ragging in telangana assembly, tdp vs trs in telangana assembly, bjp on telangana government in assembly sessions, congress leaders on telangana assembly

ragging to new mlas in telangana assembly : telangana mlas facing ragging in assembly premises and also in assembly meeting time, some of senior mlas giving critic manner comments on newly elected mlas while they are talking. new mlas feels colleges are better than assembly in ragging issue

తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ర్యాగింగ్ !!

Posted: 11/21/2014 09:27 AM IST
Ragging to new mlas in telangana assembly

ఇన్నాళ్లు కాలేజీలకు పరిమితం అయిన ర్యాగింగ్ భూతం తాజాగా అసెంబ్లీకి కూడా పాకింది. అది కూడా ఎక్కడో కాదు.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టంలో, ఎమ్మెల్యేలు ర్యాగింగ్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా పలువురు శాసనసభ్యులు లాబీల్లో మాట్లాడుకుంటున్నారట. అసెంబ్లీలో చర్చ సందర్బంగా పార్టీ తరపున మాట్లాడేందుకు ఎప్పుడో ఒకసారి కొత్త ఎమ్మెల్యేలకు కూడా అవకాశం వస్తుంది. రాక రాక వచ్చిన అవకాశాన్ని వాడుకుని.. తమ అభిప్రాయం సభలో చెప్పాలని లేచి మైకు పట్టుకోగానే వెనక నుంచి కామెంట్లు మొదలవుతాయట.

వెనకాల ఉండే సీనియర్ ఎమ్మెల్యేలు జూనియర్లపై వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తారట. ‘‘చెప్పడానికి వచ్చాడు చూడండ్రా కొత్తగా..,’’ అన్నట్లుగా హేళన చేస్తున్నారట. దీంతో అవకాశం వచ్చినా మాట్లాడాలంటే వెనకాల నుంచి ఏ కామెంట్లు వస్తాయో అని యువ ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. తోటి ప్రజా ప్రతినిధి మాట్లాడుతుంటే ఏం చెప్తున్నారు అని శ్రద్ధగా వినకుండా కాలేజి పిల్లల మాదిరిగా కామెంట్లు చేయటంపై విమర్శలు వస్తున్నాయి. సీనియర్లు అంటే దారి చూపాలి కాని.., ఇలా మనోభావాలను దెబ్బతీయవద్దని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి యువ ఎమ్మెల్యేల ర్యాగింగ్ బాధలపై ప్రకటన చేస్తే బాగుంటుంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana assembly  mla's  ragging  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more