Vijay png

save us, AIADMK, party workers, violence, pleads, vijayakanth, DMDK, K. Rosaiah

save us from those party workers violence pleads vijayakanth

వారి నుండి మమ్మల్ని కాపాడండీ.. ప్లీజ్..

Posted: 09/28/2014 07:19 PM IST
Vijay png

అధికార పార్టీ కార్యకర్తల నుంచి తమ కార్యకర్తలకు ప్రాణ రక్షణ కల్పించాలని తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎండీకే అధ్యక్షుడు ఎ.విజయకాంత్ కోరారు. తమ అధినేత్రి జయలలిత జైలు పాలు కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయని ఆయన అన్నారు. అన్నాడీఎంకే కార్యకర్తల నుంచి తమ పార్టీ నేతలకు ప్రమాదం పోంచి వుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు గవర్నర్ కె. రోశయ్యను కలిసి విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే కార్యకర్తల నుంచి తమతో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు రక్షణ కల్పించాలని గవర్నర్ ను కోరినట్టు భేటీ అనంతరం విజయకాంత్ తెలిపారు.

తమ పార్టీ అధినేత్రి జయలలితకు కోర్టు జైలు శిక్ష విధించడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా దౌర్జన్యకాండకు దిగారు. పుదుకొట్టయ్, తిరుచ్చిలోని డీఎండీకే కార్యాలయాలపై అన్నాడీఎంకే మద్దతుదారులు దాడి చేశారు. రెండు ప్రభుత్వ బస్సులను తగులబెట్టారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ కార్యకర్తలు, నేతలకు కూడా ప్రమాదం సంభవించవచ్చునని, అందుకని తమతో పాటు అన్ని పార్టీల నేతలకు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలని విజయకాంత్ గవర్నర్ ను కలసి కోరారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : save us  AIADMK  party workers  violence  pleads  vijayakanth  DMDK  K. Rosaiah  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more